Cinema OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా తమిళంలో మంచి విజయం సాధించిన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? ఆ మూవీ కథేంటీ? అనే విషయాలు తెలుసుకుందామా.

ఈమధ్యకాలంలో ఓటీటీలో సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. థియేటర్లలలో హిట్ అయిన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి ఒక కొత్త తమిళ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉన్న మూవీ పేరు జాకీ. ఈ తమిళ సినిమా మార్చి 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సోమవారం నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఏఅవుతుంది. ఇండియాలో టెంట్ కోటా ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు. అంతకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
తమిళంలో థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ జాకీ సినిమా జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. ఇందులో యువన్ కృష్ణ, రిధాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి, మధుసూధన్ రావు, సీతన్ మోహన్, శరణ్య రవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 10కి 8 రేటింగ్ ఉంది. జాకీ మూవీకి ప్రగభల్ దర్శకత్వం వహించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
పీకే7 స్టూడియోస్ పై ప్రేమ కృష్ణ దాస్, సి.దేవదాస్, జయ దేవదాస్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చేసింది. తమిళనాడులోని మధురై చుట్టుపక్కల పొట్టేల్ ఫైట్ చాలా ఫేమస్. ఈ కాన్సెప్ట్ తీసుకుని జాకీ చిత్రాన్ని తెరకెక్కించారు. పొట్టేల్ పందెలు కేవలం జంతువుల మధ్య కాదు.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్.. దాని వెనుక ఎంతో కథ ఉంటుందని చూపించారు. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
