AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

Team India Weaknesses T20 World Cup 2026: భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో సెమీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఇరుజట్లు రెండుసార్లు సెమీస్‌లో తలపడ్డాయి. చేరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి.

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?
Ind Vs Eng Semi Final Stats
Venkata Chari
|

Updated on: Mar 03, 2026 | 7:02 AM

Share

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాలో మూడు ప్రధాన బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని త్వరగా సరిచేయకపోతే టైటిల్ ఆశలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

1. అభిషేక్-సూర్య ఫామ్ ఆందోళన..

ఓపెనర్ అభిషేక్ శర్మకు ఈ టోర్నమెంట్ ఆశించిన విధంగా సాగలేదు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా డక్ అయ్యాడు. తరువాత దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 15 పరుగులు, జింబాబ్వేపై అర్ధశతకం సాధించాడు. కానీ వెస్టిండీస్‌పై ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అమెరికాపై అర్ధశతకం చేసిన తర్వాత స్థిరంగా రాణించలేకపోతున్నాడు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌పై ఫామ్‌లోకి రాకపోతే భారత్‌కు పెద్ద సవాలే.

ఇది కూడా చదవండి: IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?

2. ఫీల్డింగ్ లోపాలు..

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫీల్డింగ్ పెద్ద సమస్యగా మారింది. సూపర్-8 దశలో అత్యధిక క్యాచ్‌లు వదిలిన జట్టుగా భారత్ నిలిచింది.

వెస్టిండీస్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి సులభమైన రన్ ఔట్ అవకాశం వదిలేయగా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ కీలక క్యాచ్‌లు మిస్సయ్యారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు చేయగలిగింది.

మొత్తం టోర్నమెంట్‌లో భారత్ 13 క్యాచ్‌లు వదిలింది. క్యాచ్ సక్సెస్ రేట్ కేవలం 71.7 శాతం మాత్రమే. ఈ బలహీనత కొనసాగితే టైటిల్ కల నెరవేరడం కష్టం.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

3. డెత్ ఓవర్లలో పరుగుల వరద..

డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది.

వెస్టిండీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో 46 పరుగులు ఇచ్చారు.

జింబాబ్వే మ్యాచ్‌లో 40 పరుగులు.

దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 35 పరుగులు.

నాకౌట్ దశలో చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ అవసరం.

సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే టీమిండియా ఈ మూడు అంశాల్లో మెరుగుదల చూపాలి. లేకపోతే టైటిల్ కల కష్టమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క