హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
Watch Video: రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్.. సీన్ కట్‌చేస్తే..
శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరికాసేపటిలో ఆ మార్గంలో ట్రైన్ వస్తుందనే సమాచారంతో రైల్వే సిబ్బంది. రోడ్ క్రాసింగ్ పాయింట్ వద్ద వాహనదారులకు రక్షణగా రైల్వే గేట్ వేస్తున్నారు. ఇంతలో స్పీడ్‌గా దూసుకొచ్చిన ఒక మ్యాజిక్ AC వ్యాన్ రైల్వే గేట్‌ను ఢీకొట్టింది. అప్పుడే ట్రైన్ కూడా వచ్చింది. అయితే గేట్ స్ట్రాంగ్‌గా ఉండటంతో వ్యాన్ గేట్ వద్దే నిలిచిపోయింది. దీంతో ట్రైన్ ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
- S Srinivasa Rao
- Updated on: Jan 10, 2026
- 9:54 am
ఆటపాటలతో విద్య.. ఇకపై స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, IAS లు..
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల కోసం "మన్యం డాన్స్" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుబంధాన్ని పెంచడానికి, పిల్లలలో సిగ్గు, భయాన్ని పోగొట్టి సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి సైతం మెచ్చిన "ముస్తాబు" కార్యక్రమం తర్వాత ఇది మరో విజయం. ఈ డాన్స్ పిల్లలలో మానసిక ఉల్లాసాన్ని నింపుతోంది.
- S Srinivasa Rao
- Updated on: Jan 6, 2026
- 8:40 am
Andhra Pradesh: వీడెవడండీ బాబూ.. ట్రైన్ ఎక్కి రచ్చ రచ్చ.. చివరకు ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..
Viral Video: రైల్వే హైటెన్షన్ వైర్లు ప్రమాదకరమైనవి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఓ యువకుడు రైలు పైకి ఎక్కి హల్చల్ చేశాడు. తోటి ప్రయాణికులు మొత్తుకున్నా వినలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- S Srinivasa Rao
- Updated on: Jan 5, 2026
- 7:05 am
Andhra: కేంద్ర, రాష్ట్ర మంత్రులకు క్యాబేజీలతో న్యూ ఇయర్ విషెస్.. ఎక్కడ..? ఎందుకు
నూతన సంవత్సరం అంటే పూల బొకేలు, పండ్లు, మొక్కలే కాదు… ఈసారి శ్రీకాకుళం రైతులు పూర్తిగా డిఫరెంట్‌గా ఆలోచించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు క్యాబేజీ పువ్వులతో శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. .. ..
- S Srinivasa Rao
- Updated on: Jan 2, 2026
- 7:25 pm
Watch Video: నదీ తీరంలో అబ్బుర పరుస్తున్న నూతన సంవత్సర సైకత శిల్పం..
నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్‌లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు.
- S Srinivasa Rao
- Updated on: Jan 2, 2026
- 10:58 am
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా.. ఈ లేడీ మాముల్ది కాదు బాబోయ్
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ ఆమెకు మాత్రం పెళ్లి అంటే ఓ మూడు రోజుల ముచ్చట. అందుకే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది మంది భర్తలను మార్చింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ మహిళ. చివరకు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటంతో ఆ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయట పడింది.
- S Srinivasa Rao
- Updated on: Dec 26, 2025
- 12:20 pm
Andhra: భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేశారుగా
అందరూ గుడికి ఎందుకు వెళ్తారా.? దేవుడి మొక్కులు తీర్చుకునేందుకు అని అంటారు. కరెక్టే.! కానీ ఇక్కడ ఉన్న భార్యభర్తల ఇన్ టెన్షన్ కాస్త డిఫెరెంట్. వీళ్లు గుడికి వెళ్ళేది మాత్రం ఇందుకే. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- S Srinivasa Rao
- Updated on: Dec 26, 2025
- 11:31 am
Andhra: ఆమెతో ఏకాంతంగా గడపాలనుకున్నాడు.. కానీ ఆ కోరిక కథను మార్చింది.. చివరికి చీర కొంగుతో.!
ఆర్ధిక అవసరాల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకొంది ఓ మహిళ. భర్త ఉండగా బయట వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటూ వచ్చింది. ఇలా గత రెండేళ్లుగా పరిచయం ఉన్న ఓ వ్యక్తిని రూ.50 వేలు ఇవ్వాలని లేకుంటే తమ మధ్య ఉన్న పరిచయాన్ని నీ భార్యకు చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో విసుగు చెందిన ఆ వ్యక్తి..
- S Srinivasa Rao
- Updated on: Dec 23, 2025
- 10:54 am
ఇన్వెస్టిగేషన్లో దొరికిన చిన్న క్లూ.. పెద్ద కుట్రను భగ్నం చేసిన శ్రీకాకుళం పోలీసులు.. ఏంటంటే?
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. అని పండగ సీజన్లో బట్టల షాపులు పెట్టే ఆఫర్లు గురించి మీరు వినే ఉంటారు. అలాంటి ఆఫరే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పోలీసులకు తగిలింది. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకొని దర్యాప్తు చేస్తూన్న పోలీసులకు.. అతడిచ్చిన క్లూ తో మరో సెన్సేషనల్ కేసులో పిస్టల్, మ్యాగజిన్‌తో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు. దీంతో మరో నేరం జరగకుండా ముందుగానే పోలీసులు ఆపగలిగారు.
- S Srinivasa Rao
- Updated on: Dec 23, 2025
- 12:48 am
Andhra: అర్ధనారీశ్వడని కామసూత్ర ఫోటో ఎందుకు పెట్టినవ్ కాక.. నెట్టింట ఇప్పుడిదే హాట్ టాపిక్
ఒక్కోసారి కొన్ని చిన్న విషయాలు అనుకోకుండా తెగ వైరల్ అవుతాయి. ఆ నోటా ఈ నోటా చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. వివాదాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనే శ్రీకాకుళంలోనూ చోటు చేసుకుంది. ఒక సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనకు సంబంధించి నిర్వాహకులు ముద్రించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ చర్చనీయాoశం అవుతోంది.
- S Srinivasa Rao
- Updated on: Dec 21, 2025
- 9:38 am
Andhra: డబ్బులు డ్రా చేసేందుకు పోస్టాఫీస్‌కు వెళ్లగా.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి
ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, సంస్థల్లోనే కాదు ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోనూ ఖాతాదారుల డబ్బులకు రక్షణ ఉండటం లేదు. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరు సిబ్బంది చేతివాటం చూపిస్తూ ఖాతాదారులను నట్టేట ముంచుతున్నారు. కాయాకష్టం చేసుకుని సంపాదించిన సొమ్మును..
- S Srinivasa Rao
- Updated on: Dec 17, 2025
- 9:02 am
ఉపాధి కోసమని వస్తే ఇంత దారుణమా.. పక్క రాష్ట్రంలో సిక్కోలు మత్స్యకారులపై దాడి.. కొట్టొద్దని వేడుకున్నా..
ఉపాధి కోసం వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై కర్ణాటక రాష్ట్ర మత్స్యకారులు దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో ఈనెల 8న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సిక్కోలు జిల్లా మత్స్యకారులపై జరిగిన దాడి శ్రీకాకుళం జిల్లాలోను పెద్ద చర్చకు దారి తీస్తుసింది
- S Srinivasa Rao
- Updated on: Dec 13, 2025
- 6:35 am