AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPl 2026: కావ్యపాప ధురంధర్ 2 రెడీ.. 300 కాదు భయ్యో, అంతకుమించి.. బౌలర్లకు బడితపూజే ఇక.!

Kavya Maran SRH IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. జట్టులో ఉన్న ఇద్దరు స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌ను అభిమానులు ‘ధురంధర్ 2’గా అభివర్ణిస్తున్నారు. టీ20 క్రికెట్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సీజన్‌లో SRH విజయానికి కీలకంగా మారనున్నారు.

IPl 2026: కావ్యపాప ధురంధర్ 2 రెడీ.. 300 కాదు భయ్యో, అంతకుమించి.. బౌలర్లకు బడితపూజే ఇక.!
Sunrisers Hyderabad Squad 2026
Venkata Chari
|

Updated on: Mar 13, 2026 | 1:10 PM

Share

Sunrisers Hyderabad squad 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాన్యానికి చెందిన కావ్య మారన్ జట్టు ఐపీఎల్ 2026లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో సిద్ధమైంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్ టూ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి పేలవమైన బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాల్‌గా మారనుంది.

టి20 వరల్డ్ కప్‌లో దంచికొట్టిన జోడీ..

ఈ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లోనే స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో వీరి బ్యాటింగ్ జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించింది. అభిషేక్ శర్మ వేగవంతమైన అర్ధశతకం చేయగా, ఇషాన్ కిషన్ కూడా కీలక పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ ప్రదర్శనతోనే ఇద్దరూ టీ20 క్రికెట్‌లో అగ్రస్థానాలకు చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: 2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

ఇవి కూడా చదవండి

ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన ఇషాన్ కిషన్..

ఇషాన్ కిషన్ కథ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జనవరి 25 వరకు ఆయన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో కూడా లేడు. కానీ, టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో కేవలం 45 రోజుల్లోనే ప్రపంచ నంబర్ రెండు స్థానానికి చేరుకున్నాడు. టోర్నమెంట్‌లో మూడు అర్ధశతకాలతో మొత్తం 317 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 2026లో SRH ప్రారంభ మ్యాచ్‌లు..

బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉంటుంది. మూడో మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతుంది. నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 11న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరగనుంది.

ఇది కూడా చదవండి: మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్..

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రేనిస్ ఫులేత్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వార్డ్స్, నితీష్ కుమార్, జీసన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us