AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

లక్నోపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ కేవలం 51 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో లక్నో విధించిన 197 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.

శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..
Lsg Vs Pbks Ipl 2026
Krishna S
|

Updated on: May 23, 2026 | 11:30 PM

Share

ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచులు చివరి ఘట్టానికి చేరిన వేళ.. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. వరుస మ్యాచుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్ఠం చేసుకున్న శ్రేయస్ సేన.. తమ చివరి లీగ్ మ్యాచులో లక్నోపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహం ఫలించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో తానే ముందుండి నడిపించి అజేయ సెంచరీతో పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

జోష్ ఇంగ్లిస్, బదోని రాణించినా..

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, ముకుల్ చౌదరి (1) కూడా నిరాశ పరిచాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (26) కాస్త పోరాడినా పెద్ద స్కోరు చేయలేకపోయాడు. ఈ దశలో జోష్ ఇంగ్లిస్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆఖర్లో ఆయుష్ బదోని కేవలం 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అబ్దుల్ సమద్ (37) కూడా రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ కూడా 2 వికెట్లు తీశాడు.

శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం..

197 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓవర్లోనే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (0) అవుట్ అవ్వడంతో గట్టి దెబ్బ తగిలింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 69 పరుగులు) తో కలిసి శ్రేయస్ అయ్యర్ లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్నో బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో మైదానం నలుమూలలా బాదిన శ్రేయస్ అయ్యర్ కేవలం 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 198గా నమోదు చేస్తూ వన్-మ్యాన్ షోతో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు. పంజాబ్ కింగ్స్ కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ 2 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చాడు. అర్జున్ టెండూల్కర్‌కు ఒక వికెట్ దక్కింది.

Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం