AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..

Shubman Gill Instagram photo controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత సోషల్ మీడియాలో కొత్త వివాదం మొదలైంది. భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పోస్ట్ చేసిన “ఛాంపియన్స్” ఫొటోలో సంజూ శాంసన్ కనిపించకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. కీలక పాత్ర పోషించిన ఆటగాడిని ఎందుకు చూపలేదంటూ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Sanju Samson: సంజూ ఎక్కడ?.. గిల్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం.. ఇంకా నీ తిక్క తగ్గలేదా బ్రో అంటూ..
Shubman Gill Instagram Photo Controversy
Venkata Chari
|

Updated on: Mar 13, 2026 | 12:54 PM

Share

Shubman Gill Instagram photo controversy: టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup)లో భారత్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న తొలి జట్టుగా నిలిచింది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్రం మోడీ స్టేడియంలో (Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand)పై భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో స్వదేశంలోనే వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది.

టోర్నమెంట్ హీరోగా సంజూ శాంసన్..

ఈ విజయానికి హీరోగా సంజూ శాంసన్ (Sanju Samson) నిలిచాడు. కేరళకు చెందిన ఈ వికెట్‌కీపర్ బ్యాటర్ అద్భుత ప్రదర్శనతో టోర్నమెంట్ మొత్తం ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 89 పరుగులు, అలాగే న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో కూడా 89 పరుగులు చేసి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది.

ఇవి కూడా చదవండి

గిల్ సోషల్ మీడియా పోస్ట్ వివాదం..

ఇంతటి ప్రదర్శన చేసిన సంజూ శాంసన్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. భారత బ్యాటర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వివాదానికి దారితీసింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీతో ఉన్న జట్టు ఫోటోను గిల్ ఛాంపియన్స్ (Champions) అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోలో సంజూ సాంసన్ కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రంగా స్పందించారు.

టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిని ఫోటోలో చూపకపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కొందరు అభిమానులు గిల్‌పై అసూయ ఆరోపణలు కూడా చేశారు.

ఫోటో ఎడిట్ చేశారా..?

ఇంకా కొందరు అభిమానులు మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే రోజున సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంసన్ కొంతవరకు కనిపిస్తున్నట్లు చెప్పారు. దీంతో గిల్ షేర్ చేసిన ఫోటోలో శాంసన్‌ను ఎడిట్ చేసి తొలగించారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.

వరల్డ్ కప్ స్క్వాడ్‌లో గిల్ లేకపోవడం..

ఈ టోర్నమెంట్‌కు ముందు భారత జట్టు ఎంపిక సమయంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన ఎంపికదారు అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గిల్ ఎంపికకు మద్దతు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, ఇతర సెలెక్టర్లు వేగంగా ఆడగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల ఇషాన్ కిషన్ (Ishan Kishan), సంజూ శాంసన్‌లను ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గిల్‌కు ఈసారి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. అయితే ఈ నిర్ణయం జట్టులో “నో సూపర్ స్టార్” సంస్కృతిని బలపరిచిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us