AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: ఈ రైతులకు షాకివ్వనున్న కేంద్రం.. పీఎం కిసాన్‌ డబ్బులు కట్‌.. అసలు కారణం ఇదే!

PM Kisan: నేడు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. కొంత మంది రైతులకు మాత్రం ఈ విడతను నిలిపివేస్తోంది కేంద్రం. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. కొందరి రైతులను ఈ స్కీమ్‌ నుంచి పూర్తిగా..

PM Kisan: ఈ రైతులకు షాకివ్వనున్న కేంద్రం.. పీఎం కిసాన్‌ డబ్బులు కట్‌.. అసలు కారణం ఇదే!
Pm Kisan
Subhash Goud
|

Updated on: Mar 13, 2026 | 1:11 PM

Share

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్న రైతులకు సమయం రానే వచ్చింది. ఈ రోజు (మార్చి 13) సాయంత్రం ఈ విడత డబ్బులు విడదల చేయనున్నారు ప్రధాని మోదీ. అయితే కొంత మంది రైతులకు మాత్రం ఈ విడతను నిలిపివేస్తోంది కేంద్రం. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. కొందరి రైతులను ఈ స్కీమ్‌ నుంచి పూర్తిగా తొలగించనుండగా, మరి కొందరి రైతులకు 22వ విడతను నిలిపివేయనుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా తొలగిస్తోంది.

భార్యాభర్తలు ఇద్దరూ లేదా పెద్దలు, మైనర్ ఇద్దరూ ఒకేసారి పథకం నిధులను పొందుతున్న అనేక కేసులు నమోదయ్యాయి. నిబంధనల ప్రకారం, ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, అటువంటి కేసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది పేర్లను తొలగించింది కేంద్రం. అయితే ముఖ్యంగా ఈ పథకం ద్వారా సాయం పొందుతున్న రైతులు కేవైసీ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈ స్కీమ్‌లో రైతు ఆధార్‌, ఇతర వివరాలను అందించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్రం పదేపదే చెబుతూ వస్తోంది. అయినా లక్షలాది మంది ఇంకా కేవైసీ చేసుకోలేదని కేంద్రం గుర్తించింది. అలాంటి రైతులకు ఈ విడత డబ్బులను నిలిపివేస్తుంది.

ఇది కూడా చదవండి: కేవలం లక్ష రూపాయలే.. కానీ ఐదేళ్లలో 1 కోటి రూపాయలయ్యింది!

ఇవి కూడా చదవండి

పెండింగ్ వాయిదాకు డబ్బు ఎప్పుడు వేస్తారు?

అనుమానాస్పద కేసుల్లో లబ్ధిదారులకు ప్రయోజనాలు నిలిపివేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ఇప్పటికే స్పష్టంగా పేర్కొంది. భౌతిక ధృవీకరణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది. ధృవీకరణ తర్వాత రైతులు అర్హులని తేలి పథకం అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే నిలిపివేసిన నిధులు వారి ఖాతాలకు బదిలీ చేస్తామని అన్నారు.

22వ విడత విడుదలయ్యాక ఇలా చెక్‌ చేసుకోండి:

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ 22వ విడత రైతుల ఖాళీల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ విడత డబ్బులు విడుదలయ్యాక రైతులు డబ్బులు వచ్చాయా? లేదా? అని చెక్‌ చేసుకోవచ్చు.

  • ముందుగా అధికారిక PM కిసాన్ పోర్టల్‌ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలోని “రైతు కార్నర్” విభాగానికి వెళ్లి, “లబ్ధిదారుల స్థితి” ఎంపికపై క్లిక్ చేయండి.
  • తర్వాత మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • చివరగా క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, స్టేటస్‌ పొందడం అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే. పూర్తి సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: UPI Fraud: డేంజర్‌ జోన్‌లో యూపీఐ వినియోగదారులు.. ఫోన్‌లో కొత్త టూల్‌కిట్‌.. క్షణాల్లో బ్యాంకు అకౌంట్ ఖాళీ!

ఇది కూడా చదవండి: YouTubeలో 1 మిలియన్ వ్యూస్‌కి ఎన్ని డబ్బులు వస్తాయి? వీడియోల నుండి ఎంత సంపాదించవచ్చు?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us