నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?
వాళ్లది చదువుకునే రోజుల్లో ప్రారంభమైన ప్రేమ. ఈ ప్రేమ కాస్తా పెద్దల సమ్మతితో పెళ్లిగా మారింది. దీంతో ఒక్కటైన ఇద్దరూ ఆనందంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అతను ఒక ఫేమస్ యూట్యూబర్ కావడంతో భార్యను కూడా సోషల్ మీడియాకు పరిచయం చేశాడు. ఇలా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ మంచి ఆదరణ సంపాదించారు. అంతా సాఫీగా సాగుతుందనుకునే సమయంలోనే వీరి జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య ఒక కండక్టర్‌తో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మలయాళ ఫేమస్ యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఎన్ఆర్‌డీ లైఫ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మేఘ.. చెప్పాపెట్టకుండా అర్ధరాత్రి ఇంట నుండి పారిపోయింది. ఆమె ఒక కండక్టర్‌తో కలిసి వెళ్లిపోయినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సదరు కండక్టర్‌కు ఈమధ్యే ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మేఘ అతనితో వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చదువుకునే సమయంలోనే అఖిల్, మేఘలకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఇద్దరూ.. చివరకు 2024లో పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అఖిల్ మంచి యూట్యూబర్ కావడంతో.. భార్యను కూడా సోషల్ మీడియాకు పరిచయం చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఆదరణ సంపాదించారు. ఈ క్రమంలోనే మేఘ కూడా ఇన్‌స్టాలో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఫ్యాషన్, బ్యూటీ కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ సొంతంగా ఫాలోవర్స్‌ను పెంచుకుంది.
అయితే మేఘ మళ్లీ తన చదువును కొనసాగించాలనుకుంటున్నట్లు అఖిల్‌తో చెప్పడంతో అతను ఆమెను ఒక కోర్సులో చేర్పించాడు. దీంతో ఆమె రోజూ ఆ కోర్సు కోసం బస్సులో వెళ్లి వచ్చేది. ఈ క్రమంలోనే మేఘకు ఒక బస్సు కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇటీవల ఆ కండక్టర్‌కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో మేఘ అతనితో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి కండక్టర్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో మేఘ కనిపించకపోవడంతో కంగారుపడిన అఖిల్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో మేఘ ఇంట్లో నుంచి నైట్ డ్రెస్‌తో బయటకు వస్తూ చేతిలో సూట్‌కేస్ పట్టుకొని పరుగులు తీయడం, అక్కడ అప్పటికే వేచి ఉన్న కండక్టర్‌తో కలిసి కార్లో వెళ్లిపోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మేఘ ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో డబ్బు, నగలతో పాటు విలువైన వస్తువులను కూడా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై మేఘ ఒక వీడియో రిలీజ్ చేసి మళ్లీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
Wife leaves husband and runs away in conductor Two years ago, Malayalam social media influencer Akhil NRD fell in love with a young woman named Megha and married her However, Megha had an affair with a local bus conductor without her husband knowing In this sequence, a wife… pic.twitter.com/EeYk3ejx3n
— Siraj Noorani (@sirajnoorani) August 12, 2026
అఖిల్‌తో తన సంబంధం సరిగ్గా లేదని.. అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, దానికితోడు తనపై వేధింపులు ఉన్నాయని.. అందుకే తాను ఇల్లు వదిలి వెళ్లినట్లు ఆమె ఆ వీడియోలో చెప్పినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక వీడియో మాత్రం ప్రస్తుతం ఎక్కడా లేదు!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
