Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద జాతీయ రహదారి–16పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖకు వెళ్తున్న ఆటోను అతి వేగంతో వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇటీవల జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్దాం అనుకున్నా… ఒక్కోసారి అవతలి వారి అజాగ్రత్త లేదా వేరే కారణాల వల్ల ప్రమాదాల బారిన పడక తప్పడం లేదు. రెప్పపాటు అజాగ్రత్తతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా తీవ్ర విషాదం నెలకొంది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళ్తున్న ఆటోను అతి వేగంతో వెళుతున్న కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. కారు ఆటోను అతి వేగంతో ఢీ కొట్టడంతో ముందుకు దూసుకుపోయి అదుపు తప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. దీంతో ఆటో మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రమేష్ అనే వ్యక్తి మృతి చెందగా… మిగిలిన ప్రయాణికులు 12మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం GGH కి తరలించారు. బాధితులు విశాఖలోని చిన ముసుడివాడకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలసలోని రాజులమ్మ జాతరకు వెళ్లి తిరిగి విశాఖకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అమర్చిన CC కెమెరాలో సైతం ఆక్సిడెంట్ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
