గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
అయిదేళ్ల క్రితం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకున్న సంగతి మరచిపోకముందే మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో ఓ కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించారు. ఇది భవిష్యత్తులో మానవులకు సోకే ప్రమాదం ఉందని వారి పరిశోధనలో తేలింది. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో సహా పలు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ అధ్యయనం, ప్రముఖ సైన్స్ జర్నల్ 'సెల్'లో ప్రచురితమైంది.
ఈ కొత్త వైరస్… కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2, గతంలో విజృంభించిన SARS-CoV-1 వైరస్‌ల కుటుంబమైన ‘సార్బెకోవైరస్’కు చెందినది. ఇది మానవ కణాల్లో ఉండే ACE2 రిసెప్టర్‌లకు అతుక్కునే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. SARS-CoV-2 కూడా ఇదే మార్గం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించింది. ఈ లక్షణం వల్లే దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే, ఇప్పటివరకు ఈ వైరస్ మానవులకు సోకినట్లు ఎక్కడా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇది కేవలం శాస్త్రీయంగా గుర్తించిన ఒక ముప్పు మాత్రమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జంతువుల నుంచి మానవులకు వైరస్‌లు వ్యాపించే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకే ఈ పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. గబ్బిలాలు అనేక రకాల వైరస్‌లను మోసుకెళుతుంటాయి. వాటిపై నిరంతరం నిఘా పెట్టడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల ముప్పును ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత వన్యప్రాణుల్లోని వైరస్‌లపై ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షణ పెరిగింది. భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ఇలాంటి ముందస్తు హెచ్చరికలు, అంతర్జాతీయ శాస్త్రీయ సహకారం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం గుర్తు చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..

