అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్‌కు.. ఆపై..
ఒంగోలులో అంధురాలైన వివాహిత మహిళను సమీప బంధువు లాడ్జికి రప్పించి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. జల వనరుల శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మి హత్య కేసులో వెంకటరమణ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సహచరురాలి దారుణ హత్యపై ప్రత్యేక ప్రతిభావంతుల సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఒంగోలులో దారుణం జరిగింది. అంధురాలైన ఓ వివాహిత మహిళను ఆమె సమీప బంధువు ఓ లాడ్జిలో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. ఆమె భర్త కూడా ఆంధుడు కావడంతో.. పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానని మృతురాలిని సమీప బంధువు వెంకటరమణ మభ్యపెట్టాడు. గత కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు గ్రామంలో ఆమె భర్త పంచాయతీ పెట్టాడు.. అయితే వెంకటరమణ ఆమెను ఒంగోలుకు రప్పించి నిర్బంధించాడు… సోమవారం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళిన తన భార్య ఆదిలక్ష్మి ఇంటికి రాకపోవడంతో తన భార్య కనపడటం లేదని ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త మల్లికార్జున వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించే క్రమంలో బుధవారం రాత్రి ఆదిలక్ష్మి ఒంగోలులోని ఓ లాడ్జిలో హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే తీరా ఆమె హత్యకు గురైందని పోలీసులు చెప్పారని అంధుడైన ఆమె భర్త మల్లికార్జున ప్రసాద్ వాపోతున్నాడు. ఆదిలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు..ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒంగోలులోని ఎన్‌జివో హోం సమీపంలో నివాసం ఉంటున్న బొల్లేటిపల్లి ఆదిలక్ష్మి (35) జల వనరుల శాఖలో ఆఫీసు సబా ర్డినేట్‌గా పనిచేస్తున్నారు. గత సోమవారం ఆమె తన ఆఫీసుకు వెళ్ళారు. ఆ తరువాత ఇంటికి రాలేదు… భర్త, బంధువులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదిలక్ష్మి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో బుధవారం ఒంగోలులోని ఓ లాడ్జిలో ఆమె హత్యకు గురైందన్న సమాచారం వచ్చింది… దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలక్ష్మిని పథకం ప్రకారం లాడ్జికి రప్పించి ఆమెతో పరిచయం ఉన్న వెంకటరమణ అనే యువకుడు హత్య చేసినట్టు గుర్తించారు. ఆదిలక్ష్మి గొంతు కోసి హత్యకు గురైన స్థితిలో గుర్తించారు. మార్కాపురం జిల్లా పీసీపల్లి గ్రామానికి చెందిన ఆమె సమీప బంధువు చింతపల్లి వెంకటరమణ అనే వ్యక్తితో ఆదిలక్ష్మి సదురు లాడ్జీకి వచ్చి నట్లుగా రికార్డుల ఆధారంగా గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ప్రకాశంజిల్లా ఎస్‌పి హర్షవర్ధన్ రాజు తెలిపారు.
మరోవైపు అంధురాలైన తమ సహచరురాలు హత్యకు గురైన సమాచారం తెలుసుకున్న ప్రత్యేక ప్రతిభావంతుల అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలం దగ్గర ఆందోళన చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..
