టొమాటోలు వేసవిలో ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి. వీటిలో 90 శాతం వరకు నీరు ఉండటం వలన శరీరానికి రక్షణగా నిలుస్తాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించి, డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తాయి. టొమాటోల వినియోగం చర్మానికి నిగారింపునిచ్చి, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.