పిల్లల ఆరోగ్యానికి గుడ్లు మేలు చేసినా, వేసవిలో వీటిని పరిమితంగానే ఇవ్వాలి. గుడ్లు శరీరంలో వేడిని పెంచుతాయి, దీంతో గ్యాస్ సమస్యలు, జీర్ణ శక్తి తగ్గడం వంటివి రావొచ్చు. కొందరు పిల్లలకు అలెర్జీలు కూడా రావచ్చు. వేసవిలో చలువ చేసే పానీయాలు, పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు గుడ్ల మోతాదును నియంత్రించడం ముఖ్యం.