ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రహాంతరవాసులు అలాగే UFO ల గురించి అప్ డేట్ ఇచ్చారు. గ్రహాంతరవాసులపైనా గుర్తుతెలియని ఎగిరే వస్తువుల ఉనికిపైనా ఆసక్తి జనంలో కొన్ని దశాబ్దాలుగా సజీవంగా ఉంది. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఏలియన్స్ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. యూఎఫ్‌వోలపై గతంలో అత్యంత రహస్యంగా చిత్రీకరించిన 160కి పైగా ఫైళ్లను తాజాగా విడుదల చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ ఫైళ్లను బహిర్గతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
1940ల నుంచి ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో ఆ ఫైళ్లను రూపొందించారు. అందులో సైనిక సిబ్బంది చిత్రీకరించిన ఇన్‌ఫ్రారెడ్ వీడియోలు, రాడార్ చిత్రాలు, ఎఫ్‌బీఐ మెమోలు, నాసా వ్యోమగాముల నివేదికలు ఉన్నాయి. అత్యంత వేగంతో కదులుతూ దిశలు మార్చుకుంటున్న ప్రకాశవంతమైన గోళాలు, సిగరెట్, డిస్క్ ఆకారంలో ఉన్న వస్తువులను చూసినట్లు ఈ ఫైల్స్‌లో రాసుకొచ్చారు. 1969లో చంద్రుడి సమీపంలో ఓ కాంతిపుంజాన్ని చూసినట్లు అపోలో 11 వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ చెప్పిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫైళ్లు ఏవీ కూడా గ్రహాంతరవాసుల ఉనికిని కన్ఫమ్ చేయడం లేదని పెంటగాన్ అధికారులు స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో సెన్సార్లలో సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా కొన్ని వస్తువులను యూఎఫ్‌వోలుగా భ్రమపడే అవకాశం ఉందని 2024 నివేదికలో తెలిపారు. భారత్‌లోనూ యూఎఫ్‌వోల ప్రస్తావన ఉంది. 2023లో ఇంఫాల్ విమానాశ్రయం గగన తలంలో ఓ గుర్తు తెలియని వస్తువు కనిపించడంతో, దాన్ని అడ్డుకునేందుకు వాయుసేన రెండు రఫేల్ యుద్ధ విమానాలను పంపింది. అయితే, అది కాసేపటికే కనుమరుగైంది. భారత్-చైనా సరిహద్దులోని కోంగ్‌కా లా పాస్‌ను స్థానికులు యూఎఫ్‌వో బేస్‌గా భావిస్తుంటారు. ఏలియన్లపై ఉన్న ఆసక్తి తో ఇతర దేశాలు కూడా అలాంటి సమాచారాన్ని భద్రపరచాలని ఆలోచిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడ ఉన్నాడంటే?
ఏంటీ ? వీళ్ల మధ్య ఉన్నది భార్య భర్తల బంధం కాదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

