AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లోనే అద్భుతమైన సన్‌సెట్ స్పాట్.. ఒక్కసారి హుడా హైట్స్ వ్యూపాయింట్ వెళ్తే ప్రకృతి ప్రేమలో పడిపోతారు!

ప్రకృతిని మన చుట్టూ చాలా మంది ఉంటారు.. మరీ ముఖ్యంగా కొందరికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అంత అందమైన అనుభూతిని మరింత అందమైన ప్రదేశాల్లో పొందాలని అనుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి చూడాలనే సందర్భాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది అరకు.

Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 14, 2026 | 11:07 AM

Share
ప్రకృతిని మన చుట్టూ చాలా మంది ఉంటారు.. మరీ ముఖ్యంగా కొందరికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అంత అందమైన అనుభూతిని మరింత అందమైన ప్రదేశాల్లో పొందాలని అనుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి చూడాలనే సందర్భాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది అరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ సమీపంలోని అరకు ప్రాంతంలో అద్భుతమైన సూర్యోదయాన్ని పరిచయం చేసే ప్రత్యేక స్పాట్‌లు ఉంటాయి. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం చూడడానికి చాలా మంది కన్యాకుమారికి వెళ్తుంటారు.

1 / 5
అక్కడ పొద్దు వాలుతుండగా ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంటుందని అది అనుభూతి చెందిన చాలా మంది చెప్పే మాట. అయితే.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అంతే అద్భుతమైన అనుభవాన్నిచ్చే ప్రదేశం మన హైదరాబాద్ నగరంలోనే ఉందంటే మీరు నమ్ముతారా..?

2 / 5
సూర్యాస్తమయాన్ని చూడాలనుకునే చాలా మంది నగరవాసులు ఉస్మాన్ సాగర్ వద్ద విశాలమైన ఒడ్డుకు లేదా హుస్సేన్ సాగర్‌లోని ప్రసిద్ధ నడక మార్గాలకు వెళ్తుంటారు. దాంతో పాటు అంతకు మించిన అందమైన ప్రదేశం నగరంలో ఎక్కడ దాగుందో మీకు తెలుసా..? టోల్ గేట్ దాటకుండా, నగర పరిధిని విడిచి వెళ్లకుండా మన మధ్యే ఈ ప్రదేశం ఉందంటే కొత్తగా ఉండొచ్చు. నగరంలో ధనికులకు ప్రధాన స్థావరమైన బంజారాహిల్స్ నడిబొడ్డున ఈ అద్భుతాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది. అదే ఎత్తైన ప్రశాంతమైన ప్రదేశం హుడా హైట్స్ వ్యూపాయింట్. రోడ్ నెం.12 మరియు ఎమ్మెల్యే కాలనీలో వంకరటింకరగా ఎత్తైన గోడలు ఉన్న సందులలో ఎప్పుడైనా ప్రయాణించారా..? ఆ సమీపంలోనే ఉన్న హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా) అభివృద్ధి చేసిన నివాస ప్రాంతం కారణంగా ఈ వ్యూపాయింట్‌కు ఆ పేరు వచ్చింది.

3 / 5
ఈ వ్యూపాయింట్‌ వద్ద ఉన్న రాతి కొండ అంచున నిలబడినప్పుడు నగరం మొత్తం మీ కళ్ల ముందే కనిపిస్తుంది. అక్కడి నుంచే ఓవైపు కేబీఆర్ జాతీయ పార్క్ యొక్క పచ్చని పచ్చికబయళ్లు కనులవిందు చేస్తాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఎత్తైన భవంతులు మీ ముందు రాజసంగా నిలబడినట్లు కనిపిస్తాయి. సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతున్న కొద్దీ దక్కన్ రాళ్లు అంబర్ రంగుతో మెరుస్తాయి. వాహనాల రద్దీతో ఎప్పుడూ హడావిడిగా ఉండే హైదరాబాద్ నగరం ఈ ప్రదేశం నుంచి చాలా అందంగా, సున్నితంగా కనిపిస్తుందంటే నమ్మండి. అయితే.. ఈ వ్యూపాయింట్‌కు చేరుకోవాలంటే రోడ్డు మొత్తం నిటారుగా పైకి ఉన్నట్లు ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణించడం ఉత్తమం.

4 / 5
రోడ్డు మార్గం వరకు సొంత వాహనాలు తీసుకుని వెళ్లవచ్చు. ఆపై కొండపైకి చేరుకునే దారిని మాత్రం నడక మార్గంలో వెళ్తేనే ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు. పనిగట్టుకుని మరీ తీర్చిదిద్దిన పర్యాటక ప్రదేశాల్లా కాకుండా, హుడా హైట్స్ వ్యూపాయింట్ సహజసిద్ధంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఎలాంటి సైన్‌బోర్డులు, ప్రవేశ టిక్కెట్లు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండడమే దీని ప్రత్యేకత. ఇంకేం మరి.. ఈ వేసవి కాలంలో చల్లని సాయంత్రాన్ని ఇలాంటి అందమైన ప్రదేశానికి వెళ్లి ఆస్వాదించండి

5 / 5
Follow Us