AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. నగరంలోని మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు, కంపోస్టు కాలనీ, బోడమ్మ గుడి వీధి, మొండేటి వీధులలో డయేరియా పంజా విసిరింది. డయేరియా బారిన పడి నగరంలోని మంగువారి తోటలోనీ మండల సురేష్ (43)అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరు మృతికి కూడా డయేరియానే కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!
E.coli Found In Drinking Water
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 8:20 AM

Share

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. నగరంలోని మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు, కంపోస్టు కాలనీ, బోడమ్మ గుడి వీధి, మొండేటి వీధులలో డయేరియా పంజా విసిరింది. డయేరియా బారిన పడి నగరంలోని మంగువారి తోటలోనీ మండల సురేష్ (43)అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరు మృతికి కూడా డయేరియానే కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 23) నుండి శుక్రవారం వరకు మొత్తం 158 డయేరియా కేసులు నమోదు కాగా, అందులో 111 మంది ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొంది 47 మంది వరకు డిస్చార్జ్ అయ్యారు.

జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద మొత్తంలో డయేరియా విజృంభించడానికి గల కారణం ఏంటి అన్నది శుక్రవారం వచ్చిన తాగునీటి శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా బయట పడింది. నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పష్టం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి 30కి పైగా శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపగా 11 చోట్ల నుండి వచ్చిన శాంపిల్స్ లో ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఈ సందర్బంగా మున్సిపాలిటీ అందించే తాగునీటినీ కొద్ది రోజులు ఎవరు తాగవద్దని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్థానికులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి వీరపాండియన్ శ్రీకాకుళం నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చెర్ల వీధి పరిసరాల్లో పారిశుధ్య పనులు, తాగునీటి పైపులైన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చెర్ల వీధిలో చికిత్స పొందుతున్న ఒక కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి, వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు.

అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో కమిషనర్ పాల్గొన్నారు. కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత పది రోజులుగా క్షేత్రస్థాయిలో అంబులెన్స్‌లు, సర్వేలెన్స్ టీమ్‌లు అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పాండ్యన్. . అయితే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని, తాత్కాలికంగా అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డయేరియా రావడానికి గల ప్రధాన కారణం విషయంలో మొదట అనేక అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు. మున్సిపాలిటీ సరఫరా చేసే తాగునీటి శాంపిల్స్ కి జరిపిన క్లోరిన్ పరీక్షలలో ఎలాంటి కంటెమినేషన్ జరిగినట్టు బయట పడలేదు. దీంతో డయేరియా బారిన పడిన బాధితుల్లో కొందరికి ట్రావెల్ హిస్టరీ ఉండటంతో బయట తిన్న ఫుడ్ అరగకపోవటం లేదా ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాజాగా విశాఖపట్నం ల్యాబ్ నుండి వచ్చిన వాటర్ శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో మాత్రం భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ప్రజలు డ్రైనేజీ కాలువల మీదుగా అక్రమంగా తాగునీటి కనెక్షన్లు తీసుకోవడం, వాటికి మోటార్లు బిగించి నీటిని లాగడం వల్ల భూగర్భంలోని మురుగునీరు మంచినీటిలో కలుస్తోందని తెలిపారు పాండియన్. అలాగే రోడ్లపై పశువులను వదలడం వల్ల కలిగే వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని పాండియన్ ఆదేశించారు.

Follow Us