AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!

విద్యాబుద్ధులు నేర్పే చదువుల నిలయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విద్యార్థినిల మార్ఫింగ్, అశ్లీల ఫోటోలు ఆ కాలేజీలో కలకలం రేపాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అదే కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోలను అదే విద్యార్థినికే చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.

చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!
Obscene Morphed Photos Case
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 10:51 AM

Share

విద్యాబుద్ధులు నేర్పే చదువుల నిలయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విద్యార్థినిల మార్ఫింగ్, అశ్లీల ఫోటోలు ఆ కాలేజీలో కలకలం రేపాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అదే కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోలను అదే విద్యార్థినికే చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది.

శ్రీకాకుళంలోని మునసబ్‌పేటలో ఉన్న గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీలో దారుణం జరిగింది. కాలేజీలో అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కలకలం రేపింది. చదివితే ఉన్న మతి పోయిందన్నట్టు విద్యా బుద్ధులు నేర్చుకుంటాడని తల్లిదండ్రులు యువకుడిని కాలేజీకి పంపిస్తే, AI టెక్నాలజీని ఉపయోగించి తోటి విద్యార్థినిల పట్ల గలేజీ పనులకు పాల్పడ్డాడు. కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు అదే కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమె ఫోటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా తరవాత ఆ ఫోటోను ఆ విద్యార్థినికి చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో షాక్ కి గురైన ఆ యువతి ఏం చెయ్యాలో తెలియలేదు. తరువాత తేరుకుని విషయం తన పేరెంట్స్ కి చెప్పింది. బాధిత యువతి సోదరుడు మార్ఫింగ్ కి పాల్పడిన ఆ యువకుడిని నిలదీసి అతని ఫోన్ తీసుకుని చూడగా నిర్ఘాంత పోయారు. ఈ విషయాన్ని కాలేజీ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మార్ఫింగ్ చేసిన విద్యార్థి తోపాటు అతనికి సహకరించిన మరో నలుగురు విద్యార్థులకు TC ఇచ్చి కాలేజీ నుండి బయటకు పంపించేసింది మేనేజ్‌మెంట్. ఆ యువకుడు వద్ద నుండి నేరాన్ని అంగీకరిస్తూ ఓ లెటర్ ను రాయించి తీసుకుంది. అయితే ఇది మార్చి 9వ తేదీన జరగ్గా, విషయం బయటకు పొక్కకుండా కాలేజీ మేనేజ్‌మెంట్ గోప్యంగా ఉంచింది.

అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఆ యువకుడు ఫోన్ లో ఇంకా చాలామంది విరార్ధినిల అశ్లీల చిత్రాలు ఉన్నట్టు తేలింది. దీంతో కలవర పడ్డ మిగతా విద్యార్థునిలు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థినిలంతా తమ రక్షణా పరిస్థితి ఏంటని మేనేజ్‌మెంట్‌ను నిలదీశారు. దీంతో ఆలస్యంగా విషయం బయటపడింది. కాలేజీ మేనేజ్‌మెంట్ ఇక చేసేది లేక శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో సదరు యువకుడిపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసిన యువకుడు కి ఇతర యాక్టివిటీస్ ఎక్కువనే చెబుతున్నారని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంతకు ముందు సరిగా కేలేజికి కూడా వచ్చేవాడు కాదని ఆయన చెబుతున్నారు. అయితే కాలేజీ అమ్మాయిల మార్ఫింగ్ ఫోటోల వ్యవహారం ఇపుడు అంతటా చర్చనీయాంశం అయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..