- Telugu News Photo Gallery Beauty Tips In Telugu: Best Fruit Juices for Skin Whitening and Lightening
Tips for Glowing Skin: ఈ పండ్ల రసాలు అందాన్ని మరింత మెరిపిస్తాయి.. మీరూ ట్రై చేయండి
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో తాజా పండ్ల రసాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రసాలు చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించడం ద్వారా లోపలి నుంచి పోషణను అందిస్తాయి. కూరగాయలు, పండ్ల రసాలు శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడంలో సహాయపడతాయి. కాంతివంతమైన ఛాయను అందిస్తుంది. క్యారెట్ వంటి కూరగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం..
Updated on: Oct 12, 2023 | 8:36 PM

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో తాజా పండ్ల రసాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రసాలు చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించడం ద్వారా లోపలి నుంచి పోషణను అందిస్తాయి.

కూరగాయలు, పండ్ల రసాలు శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరచడంలో సహాయపడతాయి. కాంతివంతమైన ఛాయను అందిస్తుంది. క్యారెట్ వంటి కూరగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం మృదుత్వాన్ని మెరుగుపరిచి, ముడతలను తగ్గిస్తుంది.

బీట్‌రూట్‌లో విటమిన్లు, బీటాలైన్‌లు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్లలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ హృదయ సంబంధ సమస్యలను నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే ఆరెంజ్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూర రసంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది చర్మ కాంతి పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయిలో ఉండే ఫోటోప్రొటెక్టర్, బీటా కెరోటిన్ సహజ సౌందర్యాన్ని పెంచి.. సూర్యుని అతినీలలోహిత కిరణాల ప్రభావాలను తగ్గిస్తుంది. UV ప్రేరిత ఎరిథీమా నుంచి చర్మాన్ని రక్షిస్తుంది .





























