Virat Kohli Records: ఛేజింగ్ మాస్టర్‌గా విరాట్ కోహ్లీ.. సచిన్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన రన్ మెషీన్..
Virat Kohli Records: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. ఆసియాకప్ నుంచి దూకుడు పెంచాడు. ఇదే క్రమంలో వన్డే ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా మరో అర్ధ సెంచరీతో వన్డే క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్‌లో అత్యధిక 50+ స్కోరు చేసిన ప్రపంచ రికార్డ్ హోల్డర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.