- Telugu News Photo Gallery Cricket photos World Cup 2023: Pakistan Anchor Zainab Abbas Says India Has Not Exiled Her
World Cup 2023: అందుకే భారత్ నుంచి వెళ్లిపోయాను.. అసలు విషయం చెప్పేసిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్
2023 ప్రపంచకప్ కోసం ఐసీసీ డిజిటల్ టీమ్‌లో భాగమైన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్‌ను బహిష్కరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసినందుకు ఆమెను ICC డిజిటల్ ప్రపంచ కప్ టీమ్ నుండి తొలగించారని ప్రచారం సాగింది.
Updated on: Oct 13, 2023 | 6:22 PM

2023 ప్రపంచకప్ కోసం ఐసీసీ డిజిటల్ టీమ్‌లో భాగమైన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్‌ను బహిష్కరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసినందుకు ఆమెను ICC డిజిటల్ ప్రపంచ కప్ టీమ్ నుండి తొలగించారని ప్రచారం సాగింది.

ఇందుకు తగ్గట్టుగానే ఆమె సడెన్ గా భారత్‌ను విడిచి దుబాయ్‌కు వెళ్లిపోయింది. తాజాగా ఈ విషయమై జైనాబ్ అబ్బాస్ క్లారిటీ ఇచ్చింది. మొదటిసారి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.

నేను క్రికెట్ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను. ఈ క్రికెట్ ఫీల్డ్ నాకు చాలా అవకాశాలను ఇచ్చింది. ఇక పైనా నేను దీన్ని కొనసాగిస్తాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అలాగే కృతజ్ఞురాలిని' అని చెప్పుకొచ్చిన జైనాబ్ తనను భారత్ బహిష్కరించించిందన్న వార్తలను కొట్టిపారేసింది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న పాకిస్థాన్ మూడో ప్రపంచకప్ మ్యాచ్‌కు జైనాబ్ అబ్బాస్ హాజరయ్యారు. కానీ భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టినందుకు ఆమెను భారత్ నుంచి బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమంయలో జైనాబ్ అబ్బాస్‌ను భారత్ నుంచి బహిష్కరించలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా క్లారిటీ ఇచ్చింది.

నాబ్‌ను భారత్ నుంచి బయటకు పంపలేదని, వ్యక్తిగత కారణాలతోనే ఆమె దేశం విడిచి వెళ్లిందని ఐసీసీ అధికార ప్రతినిధి పీటీఐకి తెలిపారు. కాగా 2014లో భారతదేశంలో హిందువులు పూజించే దేవుళ్ల గురించి కించపరిచేలా పోస్ట్ చేసినట్లు జైనాబ్ పై ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జైనాబ్ అబ్బాస్‌పై న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమెపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.





























