- Telugu News Photo Gallery Cricket photos World Cup 2023: Sachin, Anushka Sharma and others reached Narendra Modi Stadium For India vs Pakistan Match
IND vs PAK: మరికొన్ని గంటల్లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. మోడీ స్టేడియానికి చేరుకున్న సచిన్, అనుష్క
మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది గంటల్లో అసలు సమరం ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థిపై గెలుపుకోసం టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను భారీ తేడాతో ఓడించి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అందులోనూ ప్రపంచ కప్‌లో ఆడుతున్నాయంటే ఆ మ్యాచ్ కోసం సముద్రాలు దాటైనా అభిమానులు తరలివస్తారు. ఇవాళ్టి మ్యాచ్ కోసం అదే జరుగుతోంది. రసవత్తర పోరును కళ్లారా వీక్షించేందుకు జార్జియా, నేపాల్, ఇంగ్లండ్ సహా పలుదేశాల నుంచి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
Updated on: Oct 14, 2023 | 11:31 AM

మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది గంటల్లో అసలు సమరం ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థిపై గెలుపుకోసం టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను భారీ తేడాతో ఓడించి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అందులోనూ ప్రపంచ కప్‌లో ఆడుతున్నాయంటే ఆ మ్యాచ్ కోసం సముద్రాలు దాటైనా అభిమానులు తరలివస్తారు. ఇవాళ్టి మ్యాచ్ కోసం అదే జరుగుతోంది. రసవత్తర పోరును కళ్లారా వీక్షించేందుకు జార్జియా, నేపాల్, ఇంగ్లండ్ సహా పలుదేశాల నుంచి అభిమానులు భారీగా తరలివస్తున్నారు

ఇవాళ మధ్యాహ్నం జరిగే ఇండియా-పాక్ మ్యాచ్‌లో భారత్ గెలుపుకోసం అభిమానులు పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసి జాతీయ జెండా రెపరెపలాడాలని కాంక్షిస్తున్నారు. అందుకోసం మువ్వన్నెల జెండా చేతపబట్టి హోమాలు చేస్తున్నారు. నరేంద్రమోదీ స్టేడియంలో మరికొద్ది గంటల్లో జరిగే ఇండియా -పాక్ మ్యాచ్ కోసం ప్రముఖులు అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పిటకే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ, సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్ చేరుకున్నారు.

దేశవ్యాప్తంగా ఇండియా-పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదరుచూస్తున్నారు. మరికాసేపట్లో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవడం ఖాయమని చెబుతున్నారు క్రీడాకారులు, అభిమానులు. మోదీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇండియా-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలుపుకోసం ప్రార్థిస్తున్నా మహిళలు. బ్యాట్ చేతబట్టి భారత్ విజయాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా గెలుపుకు ముందే జాతీయ జెండా పట్టుకుని సంబురాలు జరుపుకుంటున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందే అభిమానులు నరేంద్రమోదీ స్టేడియానికి పోటెత్తుతున్నారు. జాతీయ జెండాలతోపాటు ఇండియా జెర్సీలతో భారీగా తరలివస్తున్నారు. మిగిలినవారంతా కెప్టెన్లు అయితే ధోనీ మాత్రం నాయకుడంటూ ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం దగ్గర ఓ యువతి సందడి చేసింది. డెంగీ బారిన పడిన శుభ్‌మన్ గిల్‌ను మిస్ అవుతున్నామంటూ బ్యానర్ ప్రదర్శించింది. WE MISS YOU గిల్ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇండియా-పాక్ మధ్య హైటెన్షన్ మ్యాచ్‌తో పోలీసులు భద్రత మరింత పెంచారు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం దగ్గర వందలాదిగా మోహరించారు. మ్యాచ్ కోసం ప్రముఖులు తరలివస్తుండడంతో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.




