Mahesh Babu : మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా హిట్ అయ్యేది కాదు.. కారణం చెప్పిన డైరెక్టర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ డైరెక్టర్ మహేష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

దర్శకుడు తాతినేని సత్య తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన చిత్రాలు తొలి రోజుల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టవని, కానీ మౌత్ పబ్లిసిటీతోనే నిలబడతాయని ఆయన అన్నారు. ఎస్.ఎం.ఎస్ విషయంలోనూ ఇదే జరిగిందని, తొలిరోజు కంటే ఆదివారం కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. మహేష్ బాబు కుటుంబ నేపథ్యం సుధీర్ బాబుకు ఉపయోగపడినప్పటికీ, ఆయన అప్పటికి కొత్త హీరో కావడంతో రెజీనా కసాండ్రా నటన సినిమాకు కీలక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఎస్.ఎం.ఎస్లో సుధీర్ బాబు, రెజీనా కసాండ్రా ఇద్దరూ డెబ్యూడెంట్‌లుగా సైమా, ఫిలింఫేర్ అవార్డులు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సత్య అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
శివ మనసులో శృతిలోని శృతి పాత్ర గురించి చెపుతూ.. కథానాయికలకు ముఖ్యమైన ఆర్క్ ఉండేలా చూస్తానని ఆయన చెప్పారు. భీమిలి కబడ్డీ జట్టు చిత్రం గురించి మాట్లాడుతూ, 15-16 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను కమర్షియల్ సక్సెస్‌ను ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోనని, అయితే ప్రేక్షకుల హృదయాలకు సినిమా ఎంత చేరువవుతుంది అనేది తనకు ముఖ్యమని తెలిపారు. భీమిలి కబడ్డీ జట్టు కమర్షియల్‌గా ఆంధ్ర ప్రాంతంలో గొప్ప విజయం సాధించిందని, అయితే నాని అప్పట్లో కొత్త హీరో కావడంతో నైజాంలో కొంత బలహీనంగా ఉందని ఆయన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
నాని ప్రస్తుత ఇమేజ్‌తో భీమిలి కబడ్డీ జట్టు విడుదల చేసి ఉంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ భారీ విజయం సాధించేదని దర్శకుడు అభిప్రాయపడ్డారు. నాని కెరీర్‌లో భీమిలి కబడ్డీ జట్టు ఒక ప్రత్యేక చిత్రమని, తన కెరీర్ ఆర్క్‌లో ఈ సినిమాను తాను ఇష్టపడతారని సత్య అన్నారు. భీమిలి కబడ్డీ జట్టుకు సీక్వెల్ చేయాలనే ఆలోచన గతంలో ఉన్నప్పటికీ, నాని ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేంజ్‌కు అలాంటిmah సినిమా చేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. నాని చక్ దే! ఇండియా లేదా దంగల్ వంటి పవర్ఫుల్ స్పోర్ట్స్ ఫిలిం చేయాలని తాతినేని సత్య సూచించారు, అది ఆయనకు సరిపోతుందని అన్నారు. భీమిలి కబడ్డీ జట్టు వంటి చిన్న స్థాయి కథకు బదులుగా, ప్రొ కబడ్డీ లీగ్ వంటి పెద్ద బ్యాక్‌డ్రాప్‌లో సీక్వెల్ ఆలోచిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
