- Telugu News Photo Gallery Cricket photos Team India Pace Bowler Jasprit Bumrah becomes joint highest wicket taker in ODI World Cup 2023 vs Pakistan
IND vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక వికెట్ల వీరులు వీరే.. లిస్టులో బూం బూం బుమ్రా.. ఎన్నంటే?
బుమ్రాతోపాటు కుల్దీప్ యాదవ్, సిరాజ్, పాండ్యా, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ బలమైన ఆరంభాన్ని చెడగొట్టడంతోపాటు కేవలం 42.5 ఓవర్లో ఆలౌట్ చేశారు. దీంతో పాకిస్తాన్ తన ఇన్నింగ్స్ చివరి 13 ఓవర్లలో కేవలం 36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో 191 పరుగులకు ఆలౌట్ అయింది. 1999 తర్వాత 50 ఓవర్ల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది.
Updated on: Oct 14, 2023 | 6:19 PM

ప్రస్తుతం ఎనిమిది వికెట్లతో ఉన్న బుమ్రా, న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్‌లతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.

బుమ్రా షాదాబ్, అంతకుముందు ముహమ్మద్ రిజ్వాన్‌ను ఆఫ్ కట్టర్‌తో బౌల్డ్ చేశాడు. బుమ్రా తన 7 ఓవర్ల స్పెల్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి ఒక మెయిడీన్ ఓవర్ కూడా వేశాడు.

శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో జస్‌ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచకప్‌లో ఉమ్మడి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

బుమ్రాతోపాటు కుల్దీప్ యాదవ్, సిరాజ్, పాండ్యా, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టి పాక్ బలమైన ఆరంభాన్ని చెడగొట్టడంతోపాటు కేవలం 42.5 ఓవర్లో ఆలౌట్ చేశారు.

దీంతో పాకిస్తాన్ తన ఇన్నింగ్స్ చివరి 13 ఓవర్లలో కేవలం 36 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో 191 పరుగులకు ఆలౌట్ అయింది. 1999 తర్వాత 50 ఓవర్ల ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది.




