- Telugu News Photo Gallery Cinema photos Rahul Sipligunj Harinya Reddy Enjoying Honeymoon in Maldives, See Photos
Rahul Sipligunj: హనీమూన్‌లో కొత్త దంపతులు.. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య ఫొటోస్ వైరల్.. ఎక్కడికెళ్లారో తెలుసా?
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కొత్త దంపతులు హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ భార్యతో కలిసి దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు రాహుల్ సిప్లిగంజ్.
Updated on: Dec 05, 2025 | 10:01 PM

ఆస్కార్ విన్నర్, టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. నవంబర్ 27న తన ప్రేయసి హరిణ్య మెడలో మూడుముళ్లు వేశాడీ ట్యాలెంటెడ్ సింగర్

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు

పెళ్లి వేడుకల తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న రాహుల్ సిప్లిగంజ్- హరిణ్య రెడ్డి ఆ వెంటనే హనీమూన్ కు వెళ్లిపోయారు

చాలా మంది లాగే ఈ కొత్త దంపతులు కూడా మాల్దీవ్స్ ను తమ హనీమూన్ డెస్టినేషన్ గా ఎంచుకున్నారు.

ప్రస్తుతం మాల్దీవ్స్ లోని బీచ్‌లు, ప్రకృతి అందాలన మనసారా ఆస్వాదిస్తున్నారు రాహుల్ సిప్లిగంజ్ దంపతులు. తమ వెకేషన్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాడీ సింగర్.

ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్-హరిణ్యల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




