- Telugu News Lifestyle Food Stop Washing Raw Chicken, Experts Warn of Major Cross Contamination Risk in Your Kitchen
Chicken: చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే..?
చాలా మంది వంటకు ముందు పచ్చి చికెన్‌ను నీటిలో కడగడం మంచిదని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు.. సైంటిస్టులు ఈ అలవాటు చాలా ప్రమాదకరమని గట్టిగా హెచ్చరిస్తున్నారు. చికెన్ కడగడం వల్ల అసలు శుభ్రపడకపోగా.. ప్రమాకరం అని అంటున్నారు. ఇది వంటగదిలో బ్యాక్టీరియాను వ్యాపింపజేసి ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Dec 05, 2025 | 7:09 PM

ఆస్ట్రేలియా ఆహార భద్రతా సమాచార మండలి డిప్యూటీ చైర్ జూలియన్ కాక్స్ చికెన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ కడగకూడదని చెప్పారు. ఇలా చేయడం వల్ల నీటి తుంపరల ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వంటగది అంతటా వ్యాపించి.. అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.

ఎందుకు కడగకూడదు: చికెన్‌ను కడిగినప్పుడు ఆ నీటి తుంపరలు సింక్‌పైనా, చుట్టుపక్కల వస్తువులపైనా, కత్తిపీటపైనా పడతాయి. దీనివల్ల సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా వంటగది అంతా పాకుతుంది. దీన్నే క్రాస్-కాలుష్యం అంటారు.

మనం దుకాణాల నుంచి కొనుగోలు చేసే చికెన్ ఇప్పటికే శుభ్రం చేసి ఉంటుంది. కాబట్టి మళ్లీ కడగాల్సిన అవసరం లేదు. ఇలా కలుషితమైన వస్తువులను తాకి, మళ్లీ కూరగాయలను లేదా ఇతర ఆహారాన్ని తాకితే బ్యాక్టీరియా వాటికి అంటుకుంటుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వంటగదిలో కాలుష్యం జరగకుండా సురక్షితంగా ఉండాలంటే అమెరికా వ్యవసాయ శాఖ కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించమని సూచిస్తోంది. పచ్చి చికెన్, ఇతర మాంసాన్ని కడగడం మానేయండి. పచ్చి మాంసం కోయడానికి వేరే చాపింగ్ బోర్డును ఉపయోగించండి.

పచ్చి మాంసాన్ని తాకిన వెంటనే, కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో బాగా చేతులు కడుక్కోవాలి. చికెన్‌ను కనీసం 74డిగ్రీల వరకు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. ఎక్కువ వేడికి బ్యాక్టీరియా చనిపోతుంది. పచ్చి చికెన్‌ను కడగడం మానేసి, సరైన శుభ్రత పద్ధతులు పాటిస్తేనే మనం అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉండగలం.




