AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ నుంచి మంచి కిక్కిచ్చే న్యూస్.. మీ డబ్బులు ఆదా

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కీలక ప్రకటన వచ్చింది. హోమ్ లోన్ తీసుకున్నవారికి వడ్డీ రేటును తగ్గించింది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ నుంచి మంచి కిక్కిచ్చే న్యూస్.. మీ డబ్బులు ఆదా
తెలివైన వ్యూహం: మీరు ఒక ఇల్లు కొని.. దాన్ని అద్దెకు ఇవ్వండి. ఆ అద్దె డబ్బుతో మీ ఇంటి EMI కట్టండి. తక్కువ అద్దెకు వేరే చోట మీరు ఉండవచ్చు. దీని వల్ల మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మీకు నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుంది.
Venkatrao Lella
|

Updated on: Dec 06, 2025 | 7:28 AM

Share

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో దాని ఆధారంగా కస్టమర్లకు లోన్లపై వడ్డీని తగ్గించింది. రిటైల్ లోన్ లెండింగ్ రేట్‌(BRLLR) ప్రస్తుతం 8.15 శాతం వద్ద ఉండగా.. దానిని 25 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. దీంతో BRLLR రేటు 7.90 శాతానికి చేరుకుంది. డిసెంబర్ 6 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకొస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. దీని వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్లు పొందినవారికి ఈఎంఐ భారీగా తగ్గనుంది.

తగ్గనున్న హోమ్ లోన్ ఈఎంఐ

హోమ్ లోన్లను ఎక్కువగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-బేస్డ్ లెండింగ్ రేట్(EBLR) ఆధారంగా తీసుకుంటారు. హోమ్ లోన్ లేదా ఇతర లోన్లకు వడ్డీ రేటును నిర్ణయించే బెంచ్ మార్క్ ఇది. ఆర్బీఐ రేపో రేటుతో ఇది ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును 5.5 శాతం నుంచి 5.25 శాతానికి సవరించడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. హోమ్ లోన్లు అన్నీ EBLRకు లింక్ అయ్యి ఉంటాయి. దీని వల్ల హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ తగ్గనుంది. ఇండియాలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతంటి కల ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. ఇప్పుడు వీరికి ఊరట లభించనుంది.

రెండు ఆప్షన్లు

వడ్డీ రేటు తగ్గించినప్పుడు బ్యాంకులు రెండు ఆప్షన్లు ఇస్తాయి. నెలవారీ ఈఎంఐ తగ్గించడమా లేదా లోన్ టెన్యూర్ తగ్గించడమా అనే ఆప్షన్లు ఆఫర్ చేస్తాయి. మీరు ఈఎంఐ తగ్గించుకుంటే నెలవారీ మీరు చెల్లించాల్సి ఆదా అవుతుంది. అదే టెన్యూర్ తగ్గించుకుంటే మొత్తంలో భారీగా తగ్గుతుంది. లోన్ లెన్యూర్ తగ్గించుకోవడమే మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

కొత్తగా లోన్లు తీసుకున్నవారికి లాభమే

ఇక కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలనుకన్నవారికి కూడా దీని వల్ల లాభమే. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గింపుతో తక్కువ వడ్డీకి మీకు హోమ్ లోన్ లభిస్తుంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా తగ్గించగా.. మిగతా బ్యాంకుల నుంచి కూడా త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ప్రకటన రానుంది.