AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ వన్‌సైడ్ అంంటున్న అమెరికా.. ఇరాన్‌కు బలమెంత? యూఎస్‌తో కలిసొచ్చేదీ ఎవరు?

పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఒకవైపు.. ఇరాన్‌ ఒక్కటీ ఒకవైపు నిలబడి నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. అమెరికాకు వత్తాసు పలుకుతున్న దేశాల్లో సైతం దట్టమైన యుద్ధ మేఘాలు. ప్రస్తుతానికి ఎవరిది పైచేయి అనేది చెప్పలేం కానీ, సైనికపరంగా ఎవరి సత్తా ఎంత అనే లెక్క మాత్రం క్లియర్‌గా ఉంది. అమెరికా అంటున్నట్టు వార్ వన్‌సైడా లేక.. టూ సైడా.. ఎవరి స్టామినా ఎంతో ఒక్కసారి బేరీజు వేద్దామా?

వార్ వన్‌సైడ్ అంంటున్న అమెరికా.. ఇరాన్‌కు బలమెంత? యూఎస్‌తో కలిసొచ్చేదీ ఎవరు?
Us Israel Ira Conflicts
Balaraju Goud
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 8:18 PM

Share

పశ్చిమాసియా భగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఒకవైపు.. ఇరాన్‌ ఒక్కటీ ఒకవైపు నిలబడి నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. అమెరికాకు వత్తాసు పలుకుతున్న దేశాల్లో సైతం దట్టమైన యుద్ధ మేఘాలు. ప్రస్తుతానికి ఎవరిది పైచేయి అనేది చెప్పలేం కానీ, సైనికపరంగా ఎవరి సత్తా ఎంత అనే లెక్క మాత్రం క్లియర్‌గా ఉంది. అమెరికా అంటున్నట్టు వార్ వన్‌సైడా లేక.. టూ సైడా.. ఎవరి స్టామినా ఎంతో ఒక్కసారి బేరీజు వేద్దామా?

  1. 51 దేశాల్లో 128 సైనిక స్థావరాలున్న అమెరికా.. ఆయువుపట్టు మాత్రం పశ్చిమాసియానే. దాదాపు సగం మిలిటరీ పవర్‌ని ఇక్కడే మోహరించింది.
  2. పశ్చిమాసియాలో అమెరికాకు దాదాపు 40వేల మంది సైనికులున్నారు. ఇరాన్‌పై ఎప్పటికైనా విరుచుకుపడే అవసరం వస్తుందన్న ఉద్దేశంతో ఇటీవలే సైనికశక్తిని పెంచుకుంటూ వచ్చింది అమెరికా.
  3. ముఖ్యంగా USS జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్, USS అబ్రహాం లింకన్‌.. ఈ రెండు ప్లేన్ క్యారియర్లు ఆయా ప్రాంతాలకు తరలించింది.
  4. అబ్రహాం లింకన్, జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లలో వీటిలో ఎఫ్‌-18 ఫైటర్‌ జెట్‌లు, ఎఫ్‌-35 స్టెల్త్‌ యుద్ధ విమానాలు, ఈ-2 ముందస్తు హెచ్చరికల ఇచ్చే విమానాలు, రవాణా విమానాలు మొహరించాయి.
  5. పశ్చిమాసియాలో అమెరికాకు 8 పర్మనెంట్ క్యాంపులు, 11 తాత్కాలిక సైనిక కేంద్రాలు ఉన్నాయి. ప్రత్యర్థులు ఎయిర్‌స్ట్రైక్స్ చేసినప్పుడు పసిగట్టడానికి థాడ్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు అక్కడెప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

అమెరికా ఏయే మిత్రదేశాలను మిలిటరీ పరంగా ఎలా వాడుకుంటోందో చూద్దాం.

బహ్రెయిన్‌:

బహ్రెయిన్ సిటీ అల్‌ జుఫెయిర్‌లో అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్‌ హెడ్‌క్వార్టర్స్ ఇక్కడే ఉంది. వెస్టేసియాలో అమెరికా నేవీ యాక్టివిటీస్‌కి ఇదే కీలక స్థావరం. నాలుగు యుద్ధనౌకలు, రెండు సైనిక సరకు రవాణా నౌకలు ఇక్కడ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. బహ్రెయిన్‌లో 9 వేల మంది అమెరికన్‌ సైనికులు ఉండొచ్చు.

ఖతార్‌:

రాజధాని దోహా వెలుపలుండే అల్‌ ఉదైద్‌ స్థావరం. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌కు ప్రధాన కార్యాలయం. ఇక్కడ10 వేల మంది అమెరికన్‌ సైనికులు మోహరించారు. నిఘా విమానాలు, ఫైటర్‌ జెట్‌లకు ఇంధనం నింపే వ్యవస్థ కూడా ఉంటుంది.

కువైట్‌:

కువైట్ దేశంలో అమెరికాకు చాలా స్థావరాలే ఉన్నాయి. కీలకమైన క్యాంప్‌ ఆరిఫ్‌జాన్‌. ఇరాక్‌ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో అలీ అల్‌ సలేం స్థావరం ఉంది. ఇరాక్, సిరియాలో మోహరించే సైనికులకు ఇది విడిది కేంద్రం.

యూఏఈః

యూఏఈ రాజధాని అబుదాబికి దక్షిణాన ఉన్న అల్‌ దఫ్రా వైమానిక స్థావరాన్ని యూఏఈ – అమెరికా ఉమ్మడిగా ఉపయోగించుకుంటాయి. ఇక్కడ అమెరికాకు 10 విమాన స్క్వాడ్రన్లు, ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లు ఉన్నాయి. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పోర్ట్‌లో కూడా అమెరికా యుద్ధ విమానాలు ల్యాండయ్యే సదుపాయం ఉంది.

ఇరాక్‌:

ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఉత్తర కుర్దిష్‌ ప్రాంతంలో అమెరికాకు చెందిన 2,500 మంది సైనికులు ఉన్నారు. అపాచి పోరాట హెలికాప్టర్లు, చినూక్, నిఘా విమానాలున్నాయి. కుర్దిస్థాన్‌లోని ఎర్బిల్‌ వైమానిక స్థావరంలో అమెరికా, దాని మిత్రదేశాలకు రెగ్యులర్‌గా ట్రెయినింగ్ జరుగుతుంది.

సౌదీ అరేబియాః

ఇక్కడ కూడా రెండున్నరవేల మంది అమెరికా సైనికులు ఉండొచ్చని అంచనా. రియాద్‌ సమీపంలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌లో పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు, థాడ్‌ వ్యవస్థల్లో వీళ్లు పనిచేస్తుంటారు.

ఇజ్రాయెల్‌:

  1. ఇక, అమెరికా జిగ్రీ దోస్త్ ఇజ్రాయెల్‌ విషయానికొచ్చేద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ కోసమే అమెరికా ఇంతటి యుద్దానికి దిగింది. ఇంతకీ ఇజ్రాయెల్‌ స్టామినా ఎంతో చూద్దాం.
  2. సంఖ్యాపరంగా ఇరాన్‌తో పోలిస్తే ఇజ్రాయెల్‌ సైనికశక్తి తక్కువే. కానీ, మెరుపు వేగంతో బలగాలను మోహరించగల సత్తా ఉంది ఇజ్రాయెల్‌కి. 1.7 లక్షల మంది సైనికులు, అత్యవసర సమయాల్లో రంగంలో దిగడానికి 4.65 లక్షల మంది రిజర్వ్ ఆర్మీ ఇజ్రాయెల్ సొంతం.
  3. ఇజ్రాయెల్‌ దగ్గర ఎఫ్‌-16, ఎఫ్‌-35 లాంటి 600 పవర్‌ఫుల్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఉన్నాయి. అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం, నెట్‌వర్క్‌ ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ బలం.
  4. ఇజ్రాయెల్‌ నేవీలో దాదాపు 100 యుద్ధ నౌకలు, ఆరు సబ్‌మెరైన్లు, 7 కార్వెట్‌లు, గస్తీ నౌకలు ఉన్నాయి. కోస్ట్‌ని నిరంతరం కాపాడుకుంటాయి.
  5. ఇవి కాకుండా ఇజ్రాయెల్‌ దగ్గర ఐరన్‌ డోమ్, డేవిడ్‌ స్లింగ్, యారో, థాడ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలున్నాయి. 90కి పైగా అణ్వాస్త్రాలు ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకుంది ఇజ్రాయెల్.

ఇంత శక్తివంతమైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పోరాడుతోంది ఇరాన్ మీద. మరి ఇరాన్ కంట్రీకి తిరగబడే స్తోమత ఉన్నట్టా లేనట్టా? అదీ చూద్దాం.

  1. ఏకంగా 6.1 లక్షల మందితో బలంగా ఉంది ఇరాన్‌ సైన్యం. వేల మంది రిజర్వు, పారామిలటరీ దళాలు రెడీ టు ఫైట్ అంటున్నాయి.
  2. ఇరాన్ దగ్గర దాదాపు 2వేల యుద్ధ ట్యాంకులు, వేలాది సాయుధ శకటాలు ఉన్నాయి.
  3. 1,500 మూవబుల్ రాకెట్‌ లాంచర్లు, 3 వేలకుపైగా బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నట్లు అంచనా.
  4. వీటికితోడు 2లక్షల మందితో కూడిన ఫుల్లీ ట్రెయిన్డ్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్‌ దేశానికి పక్కా బలం.
  5. ఇరాన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 551 విమానాల ఫ్లీట్ ఉంది. కాకపోతే వీటిలో పాతవే ఎక్కువ.
  6. ఇరుకైన సముద్ర మార్గాల్లో కూడా కౌంటర్ ఎటాక్ చేయడం ఇరాన్ యుద్ధనౌకల ప్రత్యేకత.
  7. వీటన్నిటికంటే ఇరాన్‌కు ఉన్న బలమైన ఆయుధం ఏంటంటే.. వాళ్ల దగ్గరున్న 6వేల నౌకాదళ మందుపాతరలు. వీటిని గనుక పేలిస్తే హోర్ముజ్‌ జలసంధి తాత్కాలికంగా మూసుకుపోతుంది. మిగతా దేశాల కడుపుకొట్టగలిగే చివరి ప్రత్యామ్నాయం ఇది..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
వార్ ఐడియా అందిరింది.. పెళ్లి విషయంలో ఆ గ్రామం సరికొత్త రూల్స్..
వార్ ఐడియా అందిరింది.. పెళ్లి విషయంలో ఆ గ్రామం సరికొత్త రూల్స్..
కాకి ఎందుకు ఒక్క కన్నుతో చూస్తుంది..? శ్రీరాముడు బ్రహ్మాస్త్రం..
కాకి ఎందుకు ఒక్క కన్నుతో చూస్తుంది..? శ్రీరాముడు బ్రహ్మాస్త్రం..
స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయి పల్లవి..
స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయి పల్లవి..
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లోనే GATE 2026 ఫలితాలు విడుదల