AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా రూ.5 వేల వరకు పింఛన్.. వీరికి మాత్రమే ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నవారి కోసం ఒక పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన. ఇందులో కొంతమొత్తంలో ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్లు దాటాక ప్రతీ నెలా పింఛన్ పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. కానీ ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్ తెచ్చారు.

Central Government: కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ప్రతీ నెలా రూ.5 వేల వరకు పింఛన్.. వీరికి మాత్రమే ఛాన్స్..
Indian Money
Venkatrao Lella
|

Updated on: Apr 16, 2026 | 7:18 AM

Share

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. అనేక సేవింగ్స్, పెన్షన్ స్కీమ్‌లను తీసుకొస్తుంది. అందులో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. అసంఘటిత రంగంలోని పేదలు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకంలో కొంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలనెలా పింఛన్ పొందవచ్చు. ఒకవేళ చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామి, నామినీకి పింఛన్ సొమ్ము అందిస్తారు. అసలు ఈ పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హతలు ఏంటి..? ఎలా చేరాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అర్హతలు

-కనీస వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

-60 ఏళ్ల వయస్సు తర్వాత పింఛన్ మొదలవుతుంది

-నెలవారీగా లేదా ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు

-ప్రీమియం ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది

-60 సంవత్సరాలు వచ్చేంతవరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది

-ట్యాక్సులు చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు

ప్రీమియం ఎంత

మీరు ఏ వయస్సులో ఈ పథకంలో చేరుతున్నారు అనే విషయాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. మీకు 60 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారనేది ఎంపిక చేసుకునే దాని బట్టి కూడా ప్రీమియం ఉంటుంది. రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. 60 ఏళ్ల తర్వాత ఉద్యోగానికి రిటైర్మెంట్ అవుతారు. ఆ సమయంలో మీకు ఎలాంటి ఆదాయం ఉండదు. దీంతో అలాంటివారికి ఈ పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ఆదాయం పొందే సమయంలో డబ్బులు పొదుపు చేసుకుని వృద్దాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెపన్పవచ్చు.

ఎలా చేరాలి..?

-ప్రతీ బ్యాంకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌ను అమలు చేస్తోంది

-మీరు బ్యాంకులను సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు

-ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించిన ఆన్ లైన్ ద్వారా నమోదు కావొచ్చు. ఇక పోస్టాఫీస్ ద్వారా కూడా చేరవచ్చు.

-https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్ సైట్‌ను సందర్శించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

కావాల్సిన డాక్యుమెంట్స్

బ్యాంక్, పోస్టాఫీస్ అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్

60 ఏళ్ల ముందే మరణిస్తే..

60 ఏళ్లకు ముందే పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామి లేదా నామినీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీవిత భాగస్వామికి నెలనెలా పెన్షన్ అందుతుంది.

Follow Us