Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్.. మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి.. తులం ఎంతంటే?
గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత రెండ్రోలుగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం, లేదా ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ ఆప్షన్‌గా భావించి బంగారంపై పెట్టుబడులు పెడతారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

బంగారం, వెండి ధర అనేది ఎప్పుడూ ఒకేలా ఉండకుండా, అంతర్జాకీయా, దేశీయంగా ఉన్న కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఈ ఆభరణాల ధరలు ఎప్పకప్పుడూ మారుతూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ.. బుధవారం ఉదయం 6గంటల వరకు మాత్రం పెద్దగా మార్పు రాలేదు ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులే కనిపిస్తున్నాయి. మే 20, బుధవారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,57,050 వద్ద కొనసాగుతోండగా, వెండి ధర రూ.2,84,900 వద్ద ట్రేడువతుంది. మంగళవారంతో పోల్చుకుంటే బంగారంపై కేవలం రూ.10 పెరగ్గా, కేజీ వెండిపై రూ.100 తగ్గుదల కనిపిస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాలు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,960 వద్ద ట్రేడవుతోంది.
- ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,200 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,110 వద్ద ట్రేడవుతోంది.
- ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.1,57,050 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,960 వద్ద ట్రేడవుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,960 వద్ద ట్రేడవుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,230 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,710 వద్ద ట్రేడవుతోంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,960 వద్ద ట్రేడవుతోంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,960 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి ధరలు చూసుకుంటే దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,84,900గా ఉండగా హైదరాబాద్ లో మాత్రం 2,99,900గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు కేవలం బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైన మార్కెట్ సగటు రేట్లు మాత్రమే. ఇవి ఈరోజు, పెరగవచ్చే లేదా తగ్గవచ్చు. బంగారం కొనుగోలు చేయడానికి ముందు మీ ప్రాంతంలోని ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో అప్పటికప్పుడు ఉన్న ఖచ్చితమైన లైవ్ ధరను కనుక్కోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
