AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్‌ల నియామకానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,000 అప్రెంటీస్‌ పోస్టులను పలు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

Bank Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు
Bank Of Baroda Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: May 20, 2026 | 8:21 AM

Share

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌ల నియామకానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 5,000 అప్రెంటీస్‌ పోస్టులను పలు విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటిల్లో తెలంగాణలో 83, ఆంధ్రప్రదేశ్‌లో 188 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మే 1, 2026 నాటికి కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠంగా 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.800, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మహిళలు / ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్స్ (NAPS లేదా NATS) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష రిమోట్ ప్రొక్టోర్డ్ విధానంలో అంటే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఎక్కడి నుండైనా రాసేలా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఎంటుంది. ఈ శిక్షణా కాలంలో నెలకు రూ. 15,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఏవీ వర్తించవు. పూర్తి వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటీస్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us