AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది.

అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
Horrific Road Accident In Mahabubabad
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 20, 2026 | 8:31 AM

Share

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది. అతని భార్య మూడేళ్ల క్రితం మృతిచెందగా ఇప్పుడు సతీష్ మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట శివారులో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ ధాన్యం లోడ్‌తో నాంచారిమడూర్‌లోని మిల్లుకు వెళుతుంది. అదే సమయంలో సంపత్, సతీష్, వంశీ అనే ముగ్గురు యువకులు స్పోర్ట్ష్ బైక్‌పై వెళ్తున్నారు. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారులో ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు..

మృతులు దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్(25), లింగమల్ల సతీష్(28), పొట్టకర్ల వంశీ(22)గా గుర్తించారు. R15 _ హెవీ స్పీడ్ బైక్ పై వరంగల్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతులు ముగ్గురు బొడ్లాడ గ్రామానికి చెందిన వారే కావడంతో ఆ గ్రామమంతా విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

మృతులలో సతీష్ కుటుంబాన్ని అత్యంత విషాదఘటన. సతీష్ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. అతనికి ఒక పాప బాబు ఉండగా వారిని సతీష్ అల్లారుముద్దుగా పోషిస్తున్నాడు. ఈ ప్రమాదంలో తండ్రి సతీష్ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇద్దరు అభాగ్యులు అనాథలు అయ్యారు. అతివేగం ముగ్గురి ప్రాణాల మింగేయగా మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us