AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

టాలీవుడ్‌లో బ్రేక్.. బాలీవుడ్‌లో బిజీ! నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ బ్యూటీస్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 11:10 PM

Share

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా బాలీవుడ్ మాత్రం పలువురు దక్షిణాది హీరోయిన్లకు కొత్త ఊపిరినిస్తోంది. రాశీ ఖన్నా అక్షయ్ కుమార్-అనీస్ బజ్మీ చిత్రంతో బిజీగా ఉండగా, శ్రీలీల వరుస హిందీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తమన్నా కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘ది వ్వాన్’ (The Vvaan) వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో దక్షిణాదిలో స్లో అయిన కెరీర్‌కు బాలీవుడ్ కొత్త వేదికగా మారిందనే చర్చ సాగుతోంది.

తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్లేదు.. ఆ హీరోయిన్లను చూసుకోడానికి బాలీవుడ్ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఛాన్సుల కోసం నార్త్ వైపు చూస్తున్నారు. సౌత్‌లో ఆఫర్స్ లేక అలా చూస్తున్న వాళ్లందరికీ ఆపన్నహస్తం అందిస్తుంది బాలీవుడ్. మరి సౌత్‌లో ఖాళీగా ఉండి.. నార్త్‌లో నెట్టుకొస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా.. తెలుగులో చాలా రోజులుగా రాశీ ఖన్నాకు కష్టకాలమే నడుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమంత గొప్పగా ఆడలేదు. దానికి ముందు సిద్ధు జొన్నలగడ్డతో నటించిన తెలుసు కదా కూడా అంతే. ఇలా వరుస ఫ్లాపుల మధ్య తెలుగులో పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు రాశీ. అయితే టాలీవుడ్‌లో టైమ్ బాగోలేకపోయినా.. బాలీవుడ్ మాత్రం బాగానే ఆదరిస్తుంది ఈమెను. రాశీ ఖన్నాకు హిందీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూట్ పూర్తి చేసారీమే. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. తన కెరీర్‌లో శారీరకంగా ఈ స్థాయిలో కష్టపడిన సినిమా మరొకటి లేదని ఆమె చెప్పారు. శ్రీలీలకు కూడా బాలీవుడ్ నుంచే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. శ్రీలీలకు తెలుగులో హిట్ వచ్చి చాలా కాలమే అయింది. మాస్ జాతర, ఉస్తాద్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈమె పూర్తిగా టాలీవుడ్‌కు దూరం అయ్యారు. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు ఈ డాక్టర్ కమ్ యాక్టర్. అక్కడ కార్తిక్ ఆర్యన్, సైఫ్ అలీ కొడుకు అబ్రహాంతో సినిమాలు చేస్తున్నారు. తమన్నాకు కూడా తెలుగు కంటే హిందీలోనే వరస ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. పైగా వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో వన్ అనే సినిమా చేస్తున్నారు తమన్నా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Published on: Jul 14, 2026 11:06 PM
Follow Us