AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:59 PM

Share

యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. సుమారు రూ.500 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో యశ్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటీనటుల పారితోషికాలపై భారీ సంఖ్యలు ప్రచారంలో ఉన్నప్పటికీ, వాటిని మేకర్స్ అధికారికంగా ధృవీకరించలేదు. యశ్ మాత్రం నిర్మాత కావడంతో పారితోషికం కంటే లాభాల్లో వాటా తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో ఓ హీరో, హీరోయిన్ ఉంటేనే రెమ్యునరేషన్స్ కొండెక్కుతున్న రోజులవి. అలాంటిది ఒకే సినిమాలో ఓ ప్యాన్ ఇండియన్ హీరో.. ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఉంటే ఆ పారితోషికాల లెక్క ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. టాక్సిక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? ఈ సినిమా కోసం ఎవరెంత తీసుకున్నారు…? అసలు టాక్సిక్ బడ్జెట్ లెక్కలేంటి..? కేజియఫ్ ఫ్రాంచైజీతో యశ్‌కు వచ్చిన క్రేజ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’కు హెల్ప్ అవుతుంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంచనాలున్నాయి. వింటేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఏమాత్రం రాజీ పడకుండా KVN ప్రొడక్షన్స్‌తో కలిసి యశ్ నిర్మిస్తున్నారు. సుమారు 500 కోట్లతో టాక్సిక్ తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్స్, ఓ వీడియో సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా బడ్జెట్‌లో దాదాపు 100 కోట్లు కేవలం రెమ్యూనరేషన్ల కోసమే వాడారని టాక్ నడుస్తుంది. ముఖ్యంగా లీడ్ రోల్ చేస్తున్న యశ్ షేరింగ్ తీసుకుంటున్నారు.. ఇక హీరోయిన్స్ భారీగానే తీసుకుంటున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీకి 15 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం నయనతారకు 12 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అలాగే రుక్మిణి వసంత్‌కు 3 కోట్లు, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాకు తలా రెండు కోట్లు ఇస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌కు, అలాగే ఇతర మెయిన్ టెక్నీషియన్లకు ఇచ్చే మొత్తాలను కలుపుకుంటే పారితోషికాల చిట్టా 100 కోట్లు ఈజీగా దాటేసిందని అంచనా. కేవలం రెమ్యూనరేషన్లకు మాత్రమే కాకుండా మేకింగ్ విషయంలోనూ మేకర్స్ నీళ్లలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఆగస్ట్ 26న సినిమా విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Published on: Jul 14, 2026 10:58 PM
Follow Us