50, 60 ప్లస్ హీరోలతో జోడీ కడుతున్న కుర్ర భామలు
ఇరవైల్లోనే ఉన్న హీరోయిన్లు వరుసగా సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 29 ఏళ్ల ఆషికా రంగనాథ్ ఇప్పటికే నాగార్జున, రవితేజలతో జోడీ కట్టగా, శ్రీనిధి శెట్టి ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్ సరసన నటిస్తోంది. మంచి కథలు, బలమైన పాత్రలు, పాన్ ఇండియా గుర్తింపే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణంగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
వాళ్లు యంగ్ హీరోయిన్లే.. ఇంకా 20ల్లోనే ఉన్నారు.. 30ల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ల జోడీ మాత్రం 50 ప్లస్ హీరోలతో ఉంది. నమ్మడానికి కాస్త కష్టమే అయినా కూడా.. చిన్న వయసులోనే సీనియర్ హీరోయిన్ హోదా అందుకుంటున్నారు. వచ్చింది కదా అవకాశం అంటూ ఆ హీరోయిన్స్ కూడా సరే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్లు..? ఆషికా రంగనాథ్.. అమిగోస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ వయసు 29 ఏళ్లు మాత్రమే. కానీ నా సామిరంగాలో 60 ప్లస్ నాగార్జునతో జోడీ కట్టారు అషికా. అంతేకాదు.. అందులో తన ఒరిజినల్ ఏజ్ కంటే 15 ఏళ్ళు పెద్దగా కనిపించారు. అలా ఆషికాపై సీనియర్ ముద్ర పడిపోయింది. మొన్నామధ్య భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజతో నటించారు ఈ బ్యూటీ. శ్రీనిధి శెట్టి సైతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతున్నారు. కేజియఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత కూడా శ్రీనిధి ఎందుకో రేసులో వెనకబడిపోయారు. ఆ తర్వాత సీనియర్ హీర్ విక్రమ్‌తో కోబ్రాలో నటించారు ఈ బ్యూటీ. అది అంతగా ఆడలేదు.. ఈ మధ్యే తెలుగులో నానితో హిట్ 3, సిద్ధూతో తెలుసు కదా సినిమాలు చేసారు. వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆదర్శ కుటుంబంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తున్నారు శ్రీనిధి శెట్టి. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి క్లాసిక్స్ తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబో రిపీట్ కానుంది. అప్పుడు రైటర్‌గా ఉన్న గురూజీ.. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. మొత్తానికి చిన్న వయసులోనే సీనియర్లు అయిపోతున్నారు మన హీరోయిన్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. సరికొత్త శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

