లెజెండరీ సింగర్ ఎస్. జానకి, మహానటి సావిత్రి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చాలామందికి తెలియదు. తన సినిమా పాట కోసం సావిత్రి మరో గాయనిని కోరడంతో, జానకి ఆత్మగౌరవం దెబ్బతింది. అప్పటినుండి సావిత్రికి పాట పాడనని శపథం చేసి, దానికి కట్టుబడ్డారు. వారి వృత్తిపరమైన విభేదాలు వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేయలేదు.