Dhurandhar: జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన ‘ధురంధర్’ జపాన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. జూలై 10న సుమారు 80 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రాన్ని తొలి రోజు 900 మందికి కూడా తక్కువ మంది మాత్రమే వీక్షించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ‘RRR’, ‘కల్కి 2898 AD’, ‘సాహో’, ‘సలార్’, ‘దేవర’ వంటి తెలుగు సినిమాలు మాత్రం జపాన్‌లో బలమైన మార్కెట్‌ను ఏర్పరచుకుని వరుస విజయాలు నమోదు చేశాయి.
జపాన్ మార్కెట్ అంటే కేవలం తెలుగు హీరోలకు మాత్రమే సొంతమా…? మన సినిమాలు తప్ప మరో భాష సినిమాలను అక్కడ ఆడియన్స్ ఒప్పుకోవడం లేదా..? లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను మాత్రమే జపాన్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారా..? ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ధురంధర్ జపాన్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం పరిస్థితేంటి..? ఇండియన్ సినిమాలకు జపాన్ సెకండ్ హోమ్‌లా మారిపోయింది.. ఓవర్సీస్ అంటే ఇన్నాళ్లూ మనకు నార్త్ అమెరికానే.. కానీ ఇప్పుడు జపాన్ కూడా యాడ్ అయింది. అందులో భాగంగానే ట్రిపుల్ ఆర్, కల్కి లాంటి మూవీస్ అక్కడ కూడా అదరగొట్టాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ అయితే.. 30 ఏళ్ల నాటి ముత్తు రికార్డులను కూడా తిరగరాసింది. జపాన్‌లో కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ఆదరణ దక్కుతుంది. బాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ విడుదలవుతున్నా.. కనీసం వాటిని పట్టించుకోవడం లేదు జపనీస్. తాజాగా జూలై 10న ధురంధర్ సినిమా రిలీజ్ అయింది. అయితే 80 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాను ఫస్ట్ డే కనీసం 900 మంది కూడా చూడలేదని లెక్కలు చెప్తున్నాయి. జపాన్‌లో కూడా ధురంధర్ అద్భుతాలు చేస్తుందని నమ్మారంతా. ఎందుకంటే ఇండియన్ సినిమాలో క్లాసిక్ రేంజ్ అందుకుంది ఈ చిత్రం. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ జపాన్‌లో జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమాను అక్కడ విడుదల చేసారు. కానీ తారక్, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు ప్రత్యేకంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంటారు. ధురంధర్ తీరు చూస్తుంటే జపాన్‌లో అంచనాలు అందుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఇప్పటి వరకైతే 90స్‌లో వచ్చిన రజినీకాంత్ ముత్తు మినహాయిస్తే.. మన సినిమాలే జపాన్‌లో రప్ఫాడించాయి. బాలీవుడ్ నుంచి భజరంగీ భాయిజాన్, లంచ్ బాక్స్ లాంటి సినిమాలు ఓకే అనిపించినా.. పెద్ద విజయాలు సాధించలేదు. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ హీరోలే జపాన్‌లోనూ మ్యాజిక్ చేస్తున్నారని అర్థమవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. సరికొత్త శాటిలైట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

