ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో జరిగిన ఓ గృహ వివాదం విషాదంగా ముగిసింది. స్వప్నేశ్వర్ మిశ్రాను ఆయన భార్య కోపంతో సెల్‌ఫోన్‌తో తలపై కొట్టింది. చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించి మిశ్రా మృతి చెందారు. కొడుకు మృతికి కోడలే కారణమని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.