AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ విడుదల.. అదే మేజర్ హైలైట్

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ విడుదల.. అదే మేజర్ హైలైట్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:53 PM

Share

ఘట్టమనేని కుటుంబ వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్-లవ్ డ్రామాలో రషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం జయకృష్ణకు బలమైన ఆరంభాన్ని అందిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చేసింది.. ఘట్టమనేని వారసుడు ఎలా చేసారు..? తొలి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు..? అజయ్ భూపతి మరోసారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తున్నారా..? అందరికీ అచ్చొచ్చిన ఆ నిర్మాత.. జయకృష్ణకు కూడా కలిసొస్తారా..? శ్రీనివాస మంగాపురం ట్రైలర్‌లో ఆ విషయాలు ఎంతమంది గమనించారు..? కొత్త హీరో.. పైగా ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న హీరో అన్నపుడు ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. వాటిని అందుకోవడం అంటే కష్టం ఒక్కటే కాదు.. ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ బాధ్యతనే అజయ్ భూపతి తీసుకున్నారు. జయకృష్ణను శ్రీనివాస మంగాపురం అనే మాస్ యాక్షన్ లవ్ స్టోరీతోనే పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ అయితే రొటీన్‌గా ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనేలా కాకుండా కొత్తగానే కట్ చేసారు. ముఖ్యంగా లవ్ స్టోరీని కూడా భిన్నంగానే చూపించారు దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాలో జయకృష్ణకు సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగుంది. జయకృష్ణతో పాటు ఇదే సినిమాతో రషా తడాని కూడా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు జీవీ ప్రకాశ్ మ్యూజిక్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఇండస్ట్రీకి చాలా మంది వారసులను పరిచయం చేసిన అశ్వినీదత్.. తన వైజయంతి మూవీస్ బ్యానర్‌పైనే జయకృష్ణను కూడా పరిచయం చేస్తున్నారు. పైగా పాతికేళ్ల కింద రాజకుమారుడు విడుదలైన జూలై 30నే ఇప్పుడు అబ్బాయి జయకృష్ణ సినిమాను విడుదల చేస్తున్నారు. మోహన్ బాబు క్యారెక్టర్ శ్రీనివాస మంగాపురంకు కీలకం కానుంది. చూడాలిక.. ఈ యాక్షన్ లవ్ స్టోరీతో ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us