AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

Sukumar: స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 5:50 PM

Share

‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు సుకుమార్ సమయం తీసుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రం రూరల్ డ్రామా కంటే హై-వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే కథ, నేపథ్యంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. షూటింగ్ దసరా తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎలా ఉండబోతుంది..? ఇంకెలా ఉంటుంది.. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లోనే లెక్కల మాస్టారు ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా..? కానీ అదేం కాదు ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్‌ను కొత్తగా బయటికి వస్తున్నారని తెలుస్తుంది. మరి RC17 ముచ్చట్లేంటో చూద్దామా..? పెద్ది నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు రామ్ చరణ్.. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని సుకుమార్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ కాంబో అనగానే ముందుగా గుర్తుకొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ నటనకు ఫిదా అయిపోయారంతా. రంగస్థలం తర్వాత నటుడిగానూ చాలా ఎదిగారు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్‌లో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలారు. పుష్ప రెండు భాగాలు కలిసి 2000 కోట్లకు పైగా వసూలు చేసాయి. సుక్కు మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా.. దానికంటే ముందు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే బిజీగా ఉన్నారీయన. ఇదెలా ఉండబోతుంది.. నేపథ్యం ఏంటి అనేది చర్చ నడుస్తుంది. దీనిపై రెండు బ్యాక్‌డ్రాప్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి తెలంగాణ నేపథ్యం రూరల్ బ్యాక్‌డ్రాప్ అంటున్నారు. తెలంగాణ నేపథ్యంతో పాటు ఆల్ట్రా మోడ్రన్ స్టైలిష్ డ్రామా అనే చర్చ కూడా నడుస్తుంది. రంగస్థలంకు ముందు సుక్కు సినిమాలన్నీ స్టైలిష్‌గా ఉండేవి.. కానీ ఆ తర్వాతే మాస్‌లోకి దిగారు లెక్కల మాస్టారు. తాజాగా చరణ్‌తో హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి నేపథ్యం ఏదైనా కూడా.. 2027 జనవరిలో గానీ ఈ చిత్రం పట్టాలెక్కడం కష్టమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us