AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

Rajinikanth: రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 6:18 PM

Share

75 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రజినీకాంత్.. ఇటీవల ప్రతి చిత్రంలో స్టార్ స్టడెడ్ సపోర్టింగ్ క్యాస్ట్‌ను తన సెంటిమెంట్‌గా మార్చుకున్నారు. ‘జైలర్’, ‘వేట్టయాన్’, ‘కూలీ’ తర్వాత ‘జైలర్ 2’, ‘ధర్మన్’లోనూ అదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. పెద్ద తారాగణం కథకు మరింత బలం చేకూరుస్తుందనే నమ్మకంతోనే సూపర్ స్టార్ ఈ వ్యూహాన్ని కొనసాగిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

దర్శకుడు ఎవరైనా, నిర్మాత ఎవరైనా, హీరోయిన్ ఎవరైనా.. ఒక్క విషయంలో మాత్రం సేమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు రజినీకాంత్.. కొన్నేళ్లుగా ప్రతీ సినిమాలో అదైతే కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. కథ, కథనాలు ఎలా ఉన్నా.. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్నారు సూపర్ స్టార్. మరి రజినీ అంతగా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..? 75 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా వరస సినిమాలు చేస్తున్నారు రజినీకాంత్. సెట్స్‌పై ఓ సినిమా ఉండగానే.. బ్యాకప్‌గా మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం జైలర్ 2 విడుదలకు సిద్ధం అవుతుంటే.. ఆల్రెడీ అశ్విత్ మారిముత్తుతో ధర్మన్ సినిమా పట్టాలెక్కించారు. దీని రెగ్యులర్ షూట్ వేగంగా జరుగుతుంది. కొన్నేళ్లుగా రజినీకాంత్ ఓ సెంటిమెంట్ బలంగా ఫాలో అవుతున్నారు. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ప్రతీ సినిమాలో సపోర్టింగ్ క్యాస్ట్ బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. జైలర్ నుంచి ఇది మరీ ఎక్కువైపోయింది. నెల్సన్ తెరకెక్కించిన ఆ సినిమాలో రజినీతో పాటు శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఉన్నారు.. తాజాగా జైలర్ 2లో హృతిక్ రోషన్ యాడ్ అవుతున్నారు. జైలర్ తర్వాత విడుదలైన వేట్టయాన్‌లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా లాంటి స్టార్స్ ఉన్నారు. ఇక కూలీలో నాగార్జున, ఉపేంద్ర సహా అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. నెక్ట్స్ కమల్ హాసన్‌తో మల్టీస్టారర్‌కు రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. ఇలా ప్రతీ సినిమాలోనూ నెక్ట్స్ లెవల్ స్టార్ క్యాస్ట్ దర్శనమిస్తుంది. ఈ సపోర్ట్ సిస్టమ్‌ను బాగా క్యారీ చేస్తున్నారు రజినీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం.. భయంతో వణికిపోయిన అర్చకుడు

మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us