కొబ్బరి పాలతో మ్యాజిక్‌..! జుట్టు, ముఖం, చర్మ సంరక్షణలో 

14 July  2026

Jyothi Gadda

కొబ్బరి పాలలో విటమిన్ సి, ఇ, బి-కాంప్లెక్స్ తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, లారిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు, ముఖం, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అద్భుతం చేస్తాయి. 

పొడి, దెబ్బతిన్న జుట్టుకు జీవం: కొబ్బరి పాలలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు పొడిబారిన, దురదతో కూడిన కుదుళ్లను శాంతపరుస్తాయి. జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

ఇందులో ఉండే అవసరమైన పోషకాలు హెయిర్ ఫాలికల్స్‌ను బలోపేతం చేసి, జుట్టు వేగంగా పెరగడానికి దోహదపడతాయి. కండిషనర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి వాల్యూమ్, సిల్కీ టెక్స్చర్, సహజమైన మెరుపు వస్తాయి.

 సహజ మేకప్ రిమూవర్: ఆలివ్ ఆయిల్‌తో కొబ్బరి పాలను కలిపి మేకప్ తీసేయడానికి వాడవచ్చు. ఇది ముఖాన్ని శుభ్రం చేయడమే కాకుండా లోతుగా పోషణను అందిస్తుంది.

మొటిమల నివారణ: ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంలోని రంధ్రాలను పూడ్చకుండా, మొటిమలు రాకుండా నివారిస్తాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది.

ఫేషియల్ స్క్రబ్: కొబ్బరి పాలలో ఓట్స్‌ను 10 నిమిషాల పాటు నానబెట్టి, ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయడం ద్వారా చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు.

వృద్ధాప్య ఛాయల నివారణ: విటమిన్ సి, రాగి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది చర్మం సాగిపోకుండా, ముడతలు పడకుండా కాపాడుతుంది. సన్‌బర్న్ చికిత్సలోనూ చర్మానికి చలువ చేస్తాయి.

చర్మ మాయిశ్చరైజర్: స్నానం చేసే నీటిలో కొబ్బరి పాలు, గులాబీ రేకులు కలిపి స్నానం చేయడం లేదా నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారకుండా కాంతివంతంగా మారుతుంది.

చర్మ వ్యాధుల నుండి ఉపశమనం: ఎగ్జిమా, డెర్మటైటిస్, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి పాలు అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని అందించి, హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి.