AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ నయా హిస్టరీ.. పంజాబ్, సన్‌రైజర్స్ రికార్డులు బ్రేక్

IPL 2026 : ఈ ఐపీఎల్ సీజన్లో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడం ద్వారా రాజస్థాన్ ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది.

IPL 2026 : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ నయా హిస్టరీ.. పంజాబ్, సన్‌రైజర్స్ రికార్డులు బ్రేక్
Rajasthan Royals
Rakesh
|

Updated on: May 20, 2026 | 8:33 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన చేజ్ మాస్టర్‎గా అవతరించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడం ద్వారా రాజస్థాన్ ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో 220 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భారీ టార్గెట్‌ను అత్యధిక సార్లు సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేసిన ఏకైక జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు టాప్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల ఆల్‌టైమ్ రికార్డులను రాయల్స్ బద్దలు కొట్టింది.

జైపూర్ గ్రౌండ్‌లో నయా రికార్డ్

లక్నో సూపర్ జాయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలోనే 225 పరుగులు చేసి ఊదేసింది. ఐపీఎల్‌లో 220 ప్లస్ రన్స్ టార్గెట్‌ను రాజస్థాన్ జట్టు చేధించడం ఇది 4వ సారి. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 3 సార్లు ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు ఆ జట్లను వెనక్కి నెట్టి రాజస్థాన్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారింది. ఇక్కడ జరిగిన ప్రతి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ 220 కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. వాటిలో మూడు సార్లు భారీ టార్గెట్లు విజయవంతంగా ఛేజ్ అవ్వడం విశేషం.

ఐపీఎల్‌లో 220+ పరుగులను అత్యధిక సార్లు ఛేజ్ చేసిన జట్లు:

రాజస్థాన్ రాయల్స్ – 4 సార్లు

పంజాబ్ కింగ్స్ – 3 సార్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ – 3 సార్లు

ముంబై ఇండియన్స్ – 2 సార్లు

ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

లక్నోపై సాధించిన ఈ వీరోచిత విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 14 పాయింట్లతో దూసుకుపోతోంది. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా టాప్-4 లో నిలిచి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే టాప్-4 రేసు నుంచి తప్పుకోవడంతో రాజస్థాన్‌కు ఇదొక సువర్ణావకాశం.

కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ గాయం కారణంగా మైదానంలోకి దిగలేదు. ఆయన స్థానంలో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జట్టుకు నాయకత్వం వహించాడు. జైస్వాల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పాటు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (93 రన్స్) విధ్వంసం తోడవడంతో లక్నో బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఫలితాలు ఎలా ఉన్నా, మేమంతా ఒక అద్భుతమైన టీమ్” అంటూ లీగ్ తీవ్రతపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! బార్లు, రెస్టారెంట్లు బంద్..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
ఎల్పీజీ సిలిండర్లు వాడేవారికి కొత్త రూల్స్.. ఈ నెల నుంచే..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?