AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaaram: ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. చాలా కాలం గ్యాప్ తర్వాత సామ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధమైంది.

Maa Inti Bangaaram: ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
Maa Inti Bangaram
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 7:10 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాలకు తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కొన్నాళ్లు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు నటించిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో సామ్ యాక్టింగ్,ముఖ్యంగా యాక్షన్ సీన్లలో ఆమె ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీముఖి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ సామ్ భర్త డైరెక్టర్ రాజ్ నిడమోరు కథ అందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక్కొక్కడిని కొడతాం చూడు ప్రేమతో అబ్బా.. అంటూ పేర్కోన్నారు మేకర్స్. గత నెల జూన్ 19న విడుదలైన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పన్స్ వచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సాధారణంగా వచ్చే గ్యాప్‌లోనే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తున్నారు. సమంత తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

చాలా కాలంపాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సామ్.. మా ఇంటి బంగారం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. యూత్ తోపాటు కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాతో వినోదాన్ని పంచింది. ముఖ్యంగా ఇందులో సామ్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఇంట్లోనే శివుడికి జలాభిషేకం ఎలా చేయాలి? పూర్తి విధానం, నియమాలు..
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..