AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..

సాధారణంగా సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టులకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తమ అమాయకత్వం, నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. అయితే ఒకప్పుడు బాలనటీనటులుగా మెప్పించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చిన్నోడు ఒకరు.

Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
Master Mahendran
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 8:27 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇదివరకే కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా ఇండస్ట్రీలో సక్సె్స్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో బాలనటుడుగా హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అతడే మాస్టర్ మహేంద్రన్. తెలుగు ప్రేక్షకులకు ఈ చిన్నోడు సుపరిచితమే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన చిన్నోడు.. ఇప్పడుు హీరోగా అలరిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన పెదరాయుడు చిత్రంలో నేను చూశాను తాతయ్య అంటూ చెప్పే ఆ ఒక్క డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు అదే చిన్నోడు హీరోగా తనదైన నటనతో రాణిస్తున్నాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన మహేంద్రన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

1994లో బాలనటుడిగా తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు మహేంద్రన్. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, అమ్మాయి కోసం, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా దేవి, పెద రాయుడు చిత్రాలు అతడికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషలో దాదాపు 130కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. చిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న మహేంద్రన్.. ప్రస్తుతం తమిళంలో క్రేజీ హీరో.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

కొన్నాళ్లపాటు చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న అతడు.. ఆ తర్వాత హీరోగా మారారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు. నీలకంఠ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన మహేంద్రన్.. ఇప్పుడు వసుదేవసుతం సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదివరకు విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

మాస్టర్ మహేంద్రన్ పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Follow Us