Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది అనుష్క. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అటు సోషల్ మీడియా నుంచి సైతం బ్రేక్ తీసుకుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణం, మూవీ రిజల్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. బాహుబలి సినిమా తర్వాత సైలెంట్ అయిన అనుష్క.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ తన సినీ ప్రయాణం, మూవీస్ గురించి ఆసక్తిర విషయాలు పంచుకుంది. ప్రత్యేకించి బాహుబలి, రుద్రమదేవి చిత్రాల అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. బాహుబలి భారీ విజయం సాధించినప్పటికీ, తన పాత్రకు మొదటి భాగంలో గ్లామర్ లేకపోవడంపై ఆమె స్పందించారు. అయితే, బాహుబలి రెండో భాగంలో తన పాత్ర సూపర్ హిట్ అయిందని గుర్తు చేసుకున్నారు. బాహుబలి తర్వాత రుద్రమదేవి విడుదల కావడంతో, అంతటి విజయాన్ని సాధిస్తుందా అనే భయం తనకు ఉండేదని అనుష్క తెలిపారు. అయితే, ఆమె దృష్టి డబ్బు సంపాదనపై కాకుండా, చిత్రీకరణ సమయంలో పడే కష్టంపైనే ఉంటుందని చెప్పారు. “నాకెన్ని భయాలు, అభద్రతా భావాలు ఉన్నా, అవన్నీ షూటింగ్ సమయంలోనే ఉంటాయి. సినిమా విడుదలైన తర్వాత, అది సక్సెస్ అయినా కాకపోయినా నన్ను అంతగా ప్రభావితం చేయదు” అని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి కోసం అపారమైన కృషి చేశారని, ఒక అమ్మాయిని ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయడం సాధారణ విషయం కాదని, ఆయన స్క్రిప్ట్‌పై నమ్మకంతో చేశారని అన్నారు. కానీ సినిమాకు పేరుతో పాటు, నిర్మాతలకు, పంపిణీదారులకు ఆర్థికంగా కూడా లాభం అంతగా రాలేదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..
రుద్రమదేవి పాత్ర గురించి తనకు మొదట కాకతీయ సామ్రాజ్యం గురించి మాత్రమే తెలుసని, గుణశేఖర్ గారు రెండున్నర, మూడు గంటలు కథను వివరించినప్పుడు ఆశ్చర్యపోయానని అనుష్క చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఇంత గొప్ప, ఎమోషనల్, పెయిన్‌ఫుల్ చరిత్ర ఉందని, దాని గురించి మనకు తెలియకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. మన చరిత్ర గురించి చదవడం ప్రారంభించాలని అన్నారు. రుద్రమదేవి పాత్ర కోసం గుర్రపు స్వారీ, ఏనుగుపై ఫైట్లు, కత్తి యుద్ధాలు వంటివి చేయాల్సి వచ్చిందని అనుష్క వివరించారు. గుర్రాలంటే తనకు ఇప్పటికీ భయం ఉందని, అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదని అన్నారు. బాహుబలి షూటింగ్‌లో రానా దగ్గుబాటి కూడా గుర్రంపై నుంచి పడిన ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఏనుగుపై స్వారీ చేయడం సౌకర్యవంతంగా అనిపించిందని, ఎందుకంటే ఏనుగు నెమ్మదిగా కదులుతుందని, తనకు అది చాలా స్వీట్‌గా అనిపించిందని చెప్పారు. అయితే ఒక వార్ సీక్వెన్స్‌లో ఏనుగు ఒక్కసారిగా బెదిరి కదలిందని, ఆ అనుభవం చాలా భయానకంగా ఉందని అనుష్క తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
వ్యక్తిగతంగా తనకు ఆభరణాలు, మేకప్, డ్రెస్సింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదని, సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతానని అనుష్క వెల్లడించారు. అయితే చిన్నప్పటి నుంచి తన తల్లి రాణిలా భారీ ఆభరణాలు ధరించి ఒక సినిమా చేయాలని కోరుకునేవారని, ఆ కోరిక రుద్రమదేవి రూపంలో నెరవేరిందని ఆమె అన్నారు. రుద్రమదేవిలో ధరించినవన్నీ అసలు బంగారు ఆభరణాలేనని, వాటి బరువుతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. తన తల్లి ఇప్పుడు తనను మత్స్యకన్య (ఫిషర్ వుమెన్) పాత్ర చేయమని కోరుకుంటున్నారని ఆమె పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..
