AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో అతడు ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో త్రిష, బ్రహ్మనందం, నాజర్, సోనూసూద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని జయభేరి ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తిరక విషయాలు పంచుకున్నారు.

Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..
Nassar
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2026 | 9:08 PM

Share

“అతడు” చిత్ర విజయంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి పాత్ర అత్యంత కీలకమని నటుడు నాజర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం తనకు జీవితంలో గర్వించదగిన సంఘటన అని ఆయన పేర్కొన్నారు. “అతడు”లో తన పాత్రకు సంబంధించి శోభన్ బాబు మొదటి ఎంపిక అని తనకు తెలియదని, ఈ విషయం ఇప్పుడే వింటున్నానని నాజర్ అన్నారు. శోభన్ బాబు గారికి ఆఫర్ చేసిన పాత్ర తనకు లభించడంపై ఆయన త్రివిక్రమ్‌కు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నాజర్ తన పాత్ర గురించి మాట్లాడుతూ, స్టోరీ విన్నప్పుడు అది ఒక ముఖ్యమైన క్యారెక్టర్ అనిపించిందన్నారు. రెగ్యులర్ క్యారెక్టర్ల మాదిరిగా కాకుండా, ఇది కొంచెం ప్రత్యేకంగా, రియాలిస్టిక్‌గా ఉండాలని తాను నటించానని వివరించారు. ఈ చిత్రానికి డబ్బింగ్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారని నాజర్ తెలిపారు. తాను అన్ని చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పినా, అప్పట్లో “అతడు”కు మాత్రం తాను డబ్బింగ్ చేయలేదని గుర్తుచేసుకున్నారు. త్రివిక్రమ్‌కు ఒక మంచి వాయిస్, నటుడి వాయిస్ కావాలనిపించింది. దీంతో ఆయన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని సంప్రదించి, డబ్బింగ్ చెప్పమని కోరారు. ఎస్.పి.బి. దీనికి నిరాకరించారు. ఎందుకంటే, ఎస్.పి.బి. కమల్ హాసన్ చాలా సన్నిహిత స్నేహితులు. కమల్ హాసన్ ఏ తమిళ సినిమా అయినా తెలుగులో డబ్ అయితే, ఎస్.పి.బి. మాత్రమే డబ్బింగ్ చెబుతారు. ఎస్.పి.బి. వాయిస్ ఆయన ఆస్తి అని, దానిని కమల్ హాసన్ కి తప్ప మరెవరికీ ఇవ్వడానికి ఆయన ఇష్టపడరు.

ఎస్.పి.బి. నిరాకరించిన తర్వాత, త్రివిక్రమ్ మళ్లీ వెళ్లి, “నాజర్ గారు ఏం చేశారో ఒకసారి చూడండి సార్. మీకు నచ్చితేనే చేయండి” అని అన్నారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినిమా చూసి, “నాజర్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు, నేను డబ్బింగ్ చేస్తాను” అని అంగీకరించారు. ఇది తనకు ఎంత పెద్ద గౌరవమో నాజర్ గుర్తు చేసుకున్నారు.

“నేను ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు 60 శాతం నటించానంటే, ఎస్.పి.బి. గారు మిగిలిన 40 శాతం పూర్తి చేసి ఆ పాత్రను 100 శాతం ప్రాజెక్ట్ చేశారు” అని నాజర్ అన్నారు. ఈ సంఘటన తన జీవితంలో ఎంతో గర్వించదగినదని, తన జీవితంలో గొప్ప సంఘటనలలో ఇదొకటి అని నాజర్ భావోద్వేగంగా తెలిపారు. నేడు ఎస్.పి.బి. లేకపోయినా, ఈ జ్ఞాపకం చిరస్మరణీయం అని ఆయన అన్నారు. ఎస్.పి.బి. కి, త్రివిక్రమ్‌కు, నిర్మాతలకు నాజర్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్రివిక్రమ్ ఒక అద్భుతమైన రచయిత అని, ఆయన ఒక పేజీలో చెప్పాల్సిన విషయాన్ని రెండు వాక్యాల్లో రాసేస్తారని నాజర్ ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Follow Us