AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో స్వయంగా అభినందించడం, వారి ప్రయాణంలో ఓ గొప్ప ఘట్టమని నటుడు మురళీ మోహన్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. ఓ స్టార్ హీరో తన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం తనను ఎంతగానో కదిలించిందని అన్నారు. "కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లినట్లు ఉందని అన్నారు.

Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
Murali Mohan
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2026 | 1:26 PM

Share

నటుడు మురళీ మోహన్ తన కెరీర్‌లోని మైలురాళ్లు, ముఖ్యంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భం, చిరంజీవితో తన అనుబంధం గురించి వివరించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న మురళీ మోహన్‌కు, పద్మవిభూషణ్ చిరంజీవి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం ఆయనను ఎంతగానో ఆశ్చర్యపరిచి, సంతోషపరిచిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి తన ఇంటికి వచ్చినప్పుడు “కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్లినట్లు ఉంది. పద్మవిభూషణ్ హోదాలో ఉండి నా దగ్గరికి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది,” అని మురళీ మోహన్ పేర్కొన్నారు. దానికి చిరంజీవి, “మీరు నాకు మాస్టర్ అనుకొని వచ్చాను,” అని సమాధానం ఇవ్వడం చిరంజీవి వ్యక్తిత్వానికి నిదర్శనం అని మురళీ మోహన్ అన్నారు. చిరంజీవి, మురళీ మోహన్ మధ్య సుదీర్ఘ అనుబంధం మన ఊరి పాండవులు సినిమాతో ప్రారంభమైంది. ఆ రోజుల్లో చిరంజీవికి అన్నయ్య అని పిలిచేవాడని, ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోందని మురళీ మోహన్ తెలిపారు. అప్పటికి తాను పెద్ద స్టార్‌గా ఉన్నానని, చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్ వంటి వారు కొత్త నటులుగా ఉన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

ఒకరోజు చిరంజీవి “అన్నయ్య, నాకు కూడా సక్సెస్ అయితే ఇలాగే పేరు వస్తుందా?” అని అడిగాడని, దానికి మురళీ మోహన్ “నీలో ఎంత టాలెంట్ ఉందో మా అందరి కంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏ మ్యూజిక్ చేసినా డాన్స్ చేసేస్తావు. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత కన్ను నీకు బ్రహ్మాండమైన కన్ను ఉంది, ఇట్లా ఇట్లా ఇది చూస్తే అవతల వాడు భయపడిపోయే అంత ఎక్స్ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నా నువ్వు రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఈ పరిశ్రమకు మొగుడు అవుతావు,” అని జోస్యం చెప్పానని వివరించారు. అప్పటి కృష్ణదాస్ చిరంజీవిని చూసి “మంచి విలన్ అవుతాడు,” అని అన్నప్పుడు, తాను “విలన్ ఏంటండి బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు,” అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghu Babu : ఆ సినిమా తర్వాత అవకాశాలే రాలేదు.. నన్ను చూసి జనాలు భయపడ్డారు.. నటుడు రఘుబాబు..

సీనియర్ నటుడు సత్యనారాయణ నుండి తాను నేర్చుకున్న విలువలను మురళీ మోహన్ పంచుకున్నారు. “నీకంటే ముందు వచ్చిన వాళ్ళు, పెద్ద హీరోలుగానో, కమెడియన్లుగానో ఉన్నవాళ్ళు ఇప్పుడు సినిమాలు లేక తగ్గిపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ముందు లేచి నిలబడి, కూర్చోబెట్టి, టీ లేదా కాఫీ ఇచ్చి, పని మీద వచ్చారా అని అడుగు. వాళ్ళకి అదే చాలు,” అని సత్యనారాయణ చెప్పారని మురళీ మోహన్ వివరించారు. అలాగే, నిర్మాతలకు విలువ ఇవ్వాలని, షూటింగ్ లేని రోజున కూడా వారికి అందుబాటులో ఉండాలని సత్యనారాయణ సలహా ఇచ్చినట్లు తెలిపారు. “ప్రొడ్యూసరే మనకి అన్నం పెట్టేవాడు. నీకు ఎప్పుడు ఖాళీ వచ్చినా, నీ ప్రొడ్యూసర్‌కు చెప్పు,” అనే ఆయన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నానని మురళీ మోహన్ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత బాధ్యత మరింతగా పెరిగిందని, తదుపరి పద్మవిభూషణ్ రావాలని ఆశిస్తున్నానని మురళీ మోహన్ అన్నారు. అయితే రాకపోయినా నిరాశ చెందనని, అదృష్టం, ప్రతిభ, కృషి అన్నీ కలిస్తేనే విజయం సాధ్యమవుతాయని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Samantha : సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు.. 2 ఏళ్లు అలాంటి ఆహారం.. నందినీరెడ్డి..

మురళిమోహన్, చిరంజీవి..

Murali Mohan, Chiranjeevi

Murali Mohan, Chiranjeevi

ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా..

Follow Us