AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ సత్తా చాటుతున్నాయి. పక్కా మాస్ మ్యూజిక్.. ఈజీగా పాడుకునే సాహిత్యం ఉండడంతో తెలంగాణ పల్లె పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. అయితే కొన్ని సినిమా పాటలు మాత్రం దశాబ్దాలు గడిచినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.

Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90's కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
Nuvvu Yaadikelthe Song
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2026 | 1:27 PM

Share

కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ ఉంటాయి. అలాగే కొన్ని పాటలు సైతం ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ సాంగ్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఆ పాటలు దూసుకుపోతున్నాయి. అలాంటి క్లాసిక్ హిట్ సాంగ్ ఇదే. అదే “నువ్వు యాడికెళ్తే ఆడికోస్తా సువర్ణ” సాంగ్. ఒకప్పటి లవర్ బాయ్ రోహిత్, అనితా పాటిల్ జంటగా నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలోనిది ఈ పాట. 2002లో విడుదలైన ఈ చిత్రం యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాట సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పాటలోని బీట్, లిరిక్స్ చాలా క్యాచీగా ఉంటాయి. “నువ్వు యాడికెళ్తే నేను ఆడకొస్తా” అనే లైన్ అప్పట్లో ప్రతి ఒక్కరి నోటా వినపడేది. ముఖ్యంగా 90’s కుర్రాళ్లు ఈ పాటను తెగ పాడుకునేవారు. అమ్మాయిలను ఆటపట్టించడానికి.. కాలేజీలలో ఫేర్ వేల్ పార్టీలలో ఈ పాట జోరు మాములుగా ఉండేది కాదు.

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

గ్రామీణ, పట్టణ యువతను ఆకట్టుకునేలా ఈ పాటను కంపోజ్ చేశారు. రోహిత్ ఎనర్జిటిక్ స్టెప్స్, అనితా పాటిల్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను విజువల్‌గా కూడా సూపర్ హిట్ చేశాయి. అప్పట్లో లవర్స్ మధ్య ఉండే సరదా గొడవలు, ప్రేమను ఈ పాటలో చాలా చక్కగా చూపించారు.ఈ సాంగ్ విడుదలైన ఇన్నేళ్లయినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. . ఇప్పటికీ పాత జ్ఞాపకాలను (Nostalgia) ఇష్టపడే సంగీత ప్రియులు ఈ పాటను లూప్‌లో వింటుంటారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ కాలంలో ఇలాంటి పాత హిట్ సాంగ్స్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వస్తూ నేటి తరం యువతకు కూడా చేరువవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

గర్ల్ ఫ్రెండ్ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ.. ఈ చిత్రంలోని ఈ సాంగ్ మాత్రం అప్పట్లో థియేటర్లను ఊపేసింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా చేసింది ఈ సాంగ్. అటు క్లాస్.. ఇటు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన “నువ్వు యాడికెళ్తే” సాంగ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్ మాస్ లవ్ సాంగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

నువ్వు యాడికెల్తే ఆడికోస్తా సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ