AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..

బుల్లితెరపై బిగ్ బాస్‌ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఓవైపు అగ్నిపరీక్ష కోసం సన్నాహాలు సిద్ధం చేస్తుంది టీమ్. ఇప్పటికే ఎంతో మంది అడిషన్స్ కోసం అప్లై చేసుకోగా.. త్వరలోనే ఈ షో స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై చర్చ నడుస్తోంది. రోజుకో సెలబ్రేటీ పేరు తెరపైకి వస్తుంది. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తెగ వినిపిస్తుంది.

Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2026 | 2:10 PM

Share

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటివరకు తెలుగులో 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ షో త్వరలోనే సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ఈ షో ఇప్పుడు గ్రాండ్‌గా 10వ సీజన్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ‘దశావతరం’ కాన్సెప్ట్ సీజన్ కోసం మేకర్స్ టీజర్లు, ప్రోమోలతో అంచనాలను పెంచేస్తున్నారు. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా సామాన్యులకు (కామన్‌మెన్ కేటగిరీ) అవకాశం కల్పిస్తూ ‘అగ్ని పరీక్ష’ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షో కోసం సామాన్యులు ఎంతో మంది అప్లై చేసుకున్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే అగ్ని పరీక్ష గురించి అధికారిక ప్రకటన రానుంది. త్వరలోనే ఈ షోను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. అటు సోషల్ మీడియాలో రోజుకో సెలబ్రేటీ పేరు వినిపిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

అయితే, సెలబ్రిటీల విభాగంలో ఎవరెవరు రాబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో, బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్, యంగ్ హీరో అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఆమె బిగ్‌బాస్ 10వ సీజన్ లోకి కంటెస్టెంట్‌గా రావడం దాదాపు ఖాయమైందని ప్రచారం జరుగుతోంది. తేజస్విని గౌడ ‘కోయిలమ్మ’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆ తర్వాత ‘కేర్ ఆఫ్ అనసూయ’తో పాటు పలు తమిళ సీరియల్స్‌లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022లో ఆమె నటుడు అమర్‌దీప్‌ను వివాహం చేసుకుంది. అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తేజస్విని బయట నుండి అందించిన సపోర్ట్, వీరిద్దరి యూట్యూబ్ వ్లాగ్స్, రీల్స్ వల్ల ఈ జంటకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

ఈ క్రేజ్ దృష్ట్యా బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించగా, ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్న తేజస్విని హౌస్‌లోకి రావడానికి భారీగా డిమాండ్ చేసినట్లు టాక్. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఆమెకు వారానికి సుమారు రూ. 6 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తేజస్వినితో పాటు చంద్రహాస్, సుప్రీత, అభినవ్ గోమటం, నిరుపమ్ పరిటాల, యాంకర్ శ్యామల, వర్ష వంటి పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ 10వ సీజన్ కంటెస్టెంట్ల రేసులో ఉన్నాయి. తేజస్విని ఎంట్రీపై పూర్తి స్పష్టత రావాలంటే బిగ్‌బాస్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

తేజస్విని గౌడ..

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

Follow Us