AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

పెట్రోల్‌ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

Phani CH
|

Updated on: Jul 12, 2026 | 6:35 PM

Share

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో పెట్రోల్ పోయించుకుని డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నించిన దుండగులు, అడ్డుకున్న పెట్రోల్ బంక్ ఉద్యోగిని కారుతో కొంతదూరం ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ఉద్యోగికి తీవ్ర గాయాలు కాగా, ఒక చేయి విరిగింది. మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డవగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కారులో పెట్రోల్ పోయించుకుని, డబ్బులు అడిగినందుకు ఒక పెట్రోల్ పంప్ ఉద్యోగిని కారుతో సహా రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దౌసా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 21 పక్కన ఉన్న కాందోలి పెట్రోల్ పంప్‌లో ఈ ఘోరం జరిగింది. ఒక కారులో వచ్చిన దుండగుల ముఠా.. తమ వాహనంలో రూ.4,000 ల విలువైన పెట్రోల్‌ను పోయించుకుంది. పెట్రోలు పోసిన అనంతరం బంకు సిబ్బది వారిని డబ్బులు అడిగాడు. దాంతో..యూపీఐ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేస్తామంటూ పెట్రోల్ పంప్ ఉద్యోగిని మాటల్లో దించారు. నిందితులు అలా మాట్లాడుతూనే.. ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు దూకించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఉద్యోగి కారును ఆపబోగా, దుండగులు కారును ఆపకుండా అతడిని రోడ్డుపై కొంతదూరం ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో సదరు ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి, ఒక చేయి కూడా విరిగింది. ప్రస్తుతం బాధితుడు దౌసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పెట్రోల్ పంప్ యాజమాన్యం, బాధితుడు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంటల దొంగ.. దొరికాడు ఇలా..!

అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!

వామ్మో… ఈ శునకం ట్యాలెంట్‌ మామలుగా లేదు!

సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?

కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!

Follow Us